Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పాన్ కార్డ్‌తో ఆధార్ అనుసంధానం గడువును మరో మూడు మాసాలు పొడిగి స్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటిం చింది. రూ.1000 జరిమానాతో మార్చి 31 నాటికే ఈ గడువు ముగియనుంది. కానీ కొన్ని కోట్ల మంది ఇప్పటికీ వీటిని లింక్ చేసుకోనందున గడువు పెంచాలని భావించిందని తెలుస్తోంది. దీంతో పాన్, ఆధార్ అనుసంధానానికి జూన్ 31 వరకు అవకాశం కల్పించింది. అనుసంధానం చేసుకోకపోతే జూలై ఒకటో తేదీ నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు సార్లు గడువు పొడిగించింది. పాన్, ఆధార్ లింక్‌కు రూ. 1,000 రుసుం చాలా భారమని అనేక మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 51 కోట్ల పాన్లు ఆధార్‌తో అను సంధానం అయ్యాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి) పేర్కొంది.