Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పార్క్ సిరీస్‌లో మొట్టమొదటి 5జీ ఫోన్‌ను కేవలం 12,999 రూపాయలలో విడుదల చేశారు
- స్పార్క్ సిరీస్‌లో మొట్టమొదటి 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన టెక్నో ; డైమెన్శిటీ 6020 7ఎన్ఎం ప్రాసెసర్‌తో స్పార్క్ 5జీని భారతదేశంలో విడుదల చేశారు.
- టెక్నో స్పార్క్ 10 5జీ ధర 12,999 రూపాయలు. ఏప్రిల్ 7 నుంచి ఇది విక్రయాలకు అందుబాటులో ఉంటుంది.
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ , టెక్నో తమ మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆల్‌రౌండర్ స్పార్క్ పోర్ట్‌ఫోలియో కింద నేడు భారతదేశంలో విడుదల చేసింది. స్పార్క్ 10 5జీ గా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ స్పార్క్ 10 ప్రో తరువాత స్పార్క్ 10 యూనివర్శ్‌లో విడుదలైన రెండవ ఫోన్. స్పార్క్ 10 5జీలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఉన్నాయి.
స్పార్క్ 10 5జీ ధర 12,999 రూపాయలు. దీనిలో డైమెన్శిటీ 6020 7ఎన్ఎం శక్తివంతమైన 5జీ ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 13పై హెచ్ఐఓఎస్ 12.6 ఉన్నాయి. శక్తివంతమైన ప్రాసెసర్ సౌకర్యవంతమైన 5జీ కనెక్టివిటీని 10 బ్యాండ్ మద్దతుతో అందిస్తుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్, మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌తో ఉండటంతో పాటుగా 64 జీబీ అంతర్గత స్టోరేజీ ఉన్నాయి.
టెక్నో మొబైల్ ఇండియా సీఈఓ అర్జీత్ తాళపత్ర మాట్లాడుతూ ‘‘వినియోగదారులు నేడు నిత్యం అభివృద్ధి చెందడమే కాదు వేగవంతమైన, ఆధారపడతగిన కనెక్టివిటీ కోరుకుంటున్నారు. 15వేల రూపాయల లోపు 5జీ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని స్పార్క్ 10 5జీ ని ఆండ్రాయిడ్ 13తో విడుదల చేశాము. పరిశ్రమలో తొలిసారనతగ్గ ఫీచర్లను కలిగిన ఈ ఫోన్‌ను సరసమైన ధరలో అందిస్తున్నాము’’ అని అన్నారు. స్పార్క్ 10 5జీ మూడు ఆకర్షణీయమైన రంగులు– మెటా బ్లూ, మెటా వైట్, మెటా బ్లాక్‌లో ఏప్రిల్ 07, 2023 నుంచి దేశవ్యాప్తంగా లభిస్తుంది.