Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సూపర్‌ఫుడ్ బ్రాండ్ స్టార్టప్ నౌరిష్ యులో ప్రము ఖ నటీ సమంత రూత్ ప్రభు పెట్టు బడులు పెట్టారు. ఈ సంస్థలో జెరో ధాకు చెందిన నిఖిల్ కామత్, డార్విన్ బాక్స్ రోహిత్ చెన్నమనేనిలు పెట్టుబ డులు పెట్టిన వారిలో ఉన్నారు. ఈ పెట్టుబడులు నౌరిష్ యు యొక్క సీడ్ ఫండింగ్ రౌండ్లో భాగంగా వచ్చాయని ఆసంస్థ తెలిపింది. గతంలో ట్రైయంప్ గ్రూప్‌నకు చెందిన వై జనార్థన రావు, డార్విన్ బాక్స్ కో-ఫౌండర్ రోహిత్ చెన్నమనేని, కిమ్స్ హాస్పిటల్స్ సిఇఒ అభినరు బొల్లినేని వంటి వారు దీనిలో పెట్టుబడులు పెట్టారు. ''క్వినోవా, చియా సీడ్స్ వంటి సూపర్ ఫుడ్స్‌ను ఇండియాకు తీసుకురావడంలో నౌరిష్ యు వారు పోషించిన పాత్ర, స్థానికంగా వారు ఎదిగిన తీరు, తృణధాన్యాల ఆధారిత క్లీన్ లేబుల్ వీగన్ సూపర్‌ఫుడ్స్ కోసం వారి ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ నన్ను ఎంతో ఆకట్టు కుంది. వ్యాపారం పట్ల వారి వినూత్నమైన, స్ధిరమైన విధానంలో భాగం కా వడం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది.'' అని సమంత పేర్కొన్నారు.