Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలసీ జారీ చేసిన 30 రోజుల నుంచి సప్లిమెంటరీ ఆదాయం అందించనున్న ఇమీడియట్ ఇన్కమ్ వేరియంట్
- ప్రతి 5వ పాలసీ సంవత్సరంలో అదనపు గ్యారెంటీడ్ ఆదాయం అందించనున్న ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్ వేరియంట్
- డిఫర్డ్ ఇన్కమ్ వేరియంట్ తో వినియోగదారులు గ్యారెంటీడ్ ఆదాయాన్ని పాలసీ సంవత్సరంలో 2 మరియు 13వ పాలసీ సంవత్సరం నడుమ ఎప్పుడైనా అందుకోవచ్చు
- ప్రీమియం ఆఫ్సెట్ అవకాశంతో భవిష్యత్ ప్రీమియంలను సేవింగ్స్ వాలెట్లో కూడబెట్టిన నిధుల నుంచి చెల్లించవచ్చు.
నవతెలంగాణ - హైదరాబాద్
ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఐసిఐసిఐ ప్రు గోల్డ్‌ను విడుదల చేసింది. వినూత్నమైన, దీర్ఘకాలిక పొదుపు పథకమిది. వినియోగదారులు తమ వైవిధ్యమైన ఆర్థికావసరాలను అందుకునేందుకు తోడ్పడే రీతిలో అదనపు ఆదాయాన్ని సృష్టించేలా దీనిని తీర్చిదిద్దారు. జీవితాంతం ఖచ్చితంగా ఆదాయం పొందే అవకాశంతో పాటుగా ఈ పధకంలోని జీవిత భీమా కవరేజీ కుటుంబానికి ఆర్థిక భద్రతను సైతం అందిస్తుంది. వినియోగదారుల వైవిధ్యమైన అవసరాలను తీర్చేరీతిలో ఐసిఐసిఐ ప్రు గోల్డ్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్ మరియు డిఫర్డ్ ఇన్కమ్.
ఇమీడియట్ ఇన్కమ్ వేరియంట్ ఎంచుకున్న వినియోగదారులు , పాలసీ జారీ చేసిన 30వ రోజుల తరువాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. జీవితకాలం పాటు అదనపు ఆదాయాన్ని సృష్టించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్ వేరియంట్ కొనుగోలు చేసిన వినియోగదారులు అదనపు గ్యారెంటీడ్ ఆదాయాన్ని ప్రతి ఐదవ పాలసీ సంవత్సరంలో తమ జీవితకాలపు ఆదాయంతో పాటుగా పొందగలరు. ఇది పాలసీ జారీ చేసిన తేదీ నుంచి 30 రోజుల తరువాత ప్రారంభమవుతుంది.
ఇక డిఫర్డ్ ఇన్కమ్ వేరియంట్లో, తమ ఆర్ధిక లక్ష్యాలకనుగుణంగా వినియోగదారులకు తాము తమ ఆదాయం ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నారో నిర్ణయించుకోవచ్చు. వినియోగదారులు త్వరగా అంటే, తమ రెండవ పాలసీ సంవత్సరం నుంచి లేదా ఆలస్యంగా 13వ పాలసీ సంవత్సరం నుంచి ఈ ఆదాయం పొందవచ్చు. ఇది వినియోగదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ఆదాయం పొందే అవకాశం అందిస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటుగా ఐసిఐసిఐ ప్రు గోల్డ్, తమ వినియోగదారులు తమ ఆదాయాన్ని సాధారణ చెల్లింపులుగా స్వీకరించడానికి బదులుగా తమ సేవింగ్స్ వాలెట్లో ఆదాయాన్ని జమ చేసుకునే అవకాశం కూడా ఉంది. వినియోగదారులు తమ సేవింగ్స్ వాలెట్లో పొందిన ఆదాయాన్ని తతమ ఆర్ధిక అవసరాలకు అనుగుణంగా పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేయడం చేయవచ్చు. ప్రీమియం ఆఫ్సెట్ అవకాశంతో వినియోగదారులు తమ భావి ప్రీమియంలను కూడబెట్టిన ఈ నిధుల నుంచి చెల్లించవచ్చు.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా మాట్లాడుతూ ‘‘పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా చాలామంది వినియోగదారులు తమ వృత్తి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయాన్ని సైతం పొందాలనుకుంటున్నారు. ఐసిఐసిఐ ప్రు గోల్డ్ రూపకల్పనకు ఇది కారణం. ఈ వినూత్నమైన జీవితకాలపు పొదుపు పథకం వినియోగదారులకు ఖచ్చితమైన ఆదాయ వనరుగా మారడంతో పాటుగా మార్కెట్ ఒడిదుడుకులను సైతం తట్టుకునే అవకాశం అందిస్తుంది.
ఐసిఐసిఐ ప్రు గోల్డ్‌ను ప్రత్యేకంగా వినియోగదారులకు లిక్విడిటీ పరంగా సౌకర్యం అందించే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది మరియు దీనిని తమ ఆదాయ వనరులను అందుకునే రీతిలో అనుకూలీకరించారు. ఈ ప్రొడక్ట్‌లోని మూడు వేరియంట్లూ అంటే ఇమీడియట్ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్ విత్ బూస్టర్ మరియు డిఫర్డ్ ఇన్కమ్లు వినియోగదారులకు గ్యారెంటీడ్, బోనస్ ఓరియెంటెడ్ రెగ్యులర్ ఇన్‌కమ్‌తో పాటుగా లైఫ్ కవర్ కూడా అందిస్తుంది.
మేము ప్రీమియం ఆఫ్‌సెట్‌ను సైతం పరిచయం చేశాము. ఇది విప్లవాత్మక ఫీచర్. ఇది వినియోగదారులకు తమ సేవింగ్స్ వాలెట్లో జమ అయిన మొత్తాలనుంచి భావి ప్రీమియంలను చెల్లించే అవకాశం కూడా అందిస్తుంది. ఈ దీర్ఘకాల సేవింగ్స్ ప్రొడక్ట్‌తో మేము మా వినియోగదారులు తమ వైవిధ్యమైన ఆదాయ అవసరాలను అనిశ్చితి పరిస్ధితులు తమ ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయనే ఆందోళన లేకుండా చేరుకోవచ్చు’’అని అన్నారు.