Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతదేశంలో 33 అగ్రగామి ఇనిస్టిట్యూట్లతో భాగస్వామ్యం
నవతెలంగాణ - హైదరాబాద్
క్యాప్‌జెమినీ యొక్క ఇంజినీరింగ్ మరియు ఆర్ అండ్ డీ సర్వీసెస్ సంస్థ, భారతదేశ వ్యాప్తంగా 33 అగ్రగామి ఇనిస్టిట్యూట్లతో భాగస్వామ్యం చేసుకుని విద్యార్ధులు సంబంధిత నైపుణ్యాలతో భవిష్యత్‌కు సిద్ధంగా ఉండేటట్లు తీర్చిదిద్దనుంది. 2022 వరకూ 57 ఎంఓయులను చేసుకుని పీఎల్‌ఎం (ప్రొడక్ట్ లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్), ఇంజినీరింగ్ ఆటోమేషన్, మోడల్ ఆధారిత సిస్టమ్ ఇంజినీరింగ్ (ఎంబీఎస్ఈ), ఇండస్ట్రీ 4.0, 5జీ, ఎంబీడెడ్ సాఫ్ట్వేర్, వీఎల్ఎస్, నెట్వర్కింగ్ మొదలైన వాటిలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యా సంస్థలతో ఈ భాగస్వామ్యం ద్వారా అత్యంత ప్రతిభావంతులను తీర్చిదిద్దడంతో పాటుగా పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడం చేయనుంది.
ఈ ఎంఓయులలో భాగంగా క్యాప్‌జెమిని ల్యాబ్ ఆధారిత ఎంఓయు మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఇది నిర్మాణాత్మక పారిశ్రామిక విధానం అనుసరిస్తుంది. దీనిలో ఇనిస్టిట్యూట్‌ను దాని ఎన్ఐఆర్ఎఫ్/న్యాక్ ర్యాకింగ్, అటానమస్ స్ధితి, తీసుకునే విద్యార్థుల నాణ్యత తదితర అంశాలను పరిశీలించడమూ భాగంగా ఉంటుంది. అంతేకాదు, గుర్తించబడిన నైపుణ్యాల కోసం ఒక ల్యాబ్‌ను సైతం ఈ ఎంఓయు ద్వారా ఏర్పాటు చేయబడింది. నైపుణ్య ఆవశ్యకతను విద్యార్ధులకు తెలపడంతో పాటుగా సంబంధిత యూనివర్శిటీల ఆమోదంతో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త అంశాలతో కూడిన పాఠ్యాంశాలూ అందించబడతాయి. చివరకు, క్యాప్‌జెమిని నుంచి మెంటార్లను కేటాయించడం, ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం, పరిశ్రమలో అత్యుత్తమ అభ్యాసాలను అందించడం, హ్యాకథాన్లను నిర్వహించడం, విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్‌లను అందించడం, గెస్ట్ లెక్చర్స్ నిర్వహించడం మరియు నిరంతర అభివృద్ధిని నిర్ధారించడం ద్వారా ల్యాబ్ సమర్ధవంతంగా నిర్వహించబడుతుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్య మోడల్, స్టేక్‌హోల్డర్స్ అందిరికీ ప్రయోజనం కల్పిస్తుంది. ఇనిస్టిట్యూట్లు స్టూడెండ్ ప్లేస్మెంట్ల పరంగా వృద్ధిని చూస్తే, పరిశ్రమ మాత్రం ఇండస్ట్రీ రెడీ టాలెంట్‌ను పొందగలుగుతుంది.