Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టాటా ఎఐ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఎఐఎ) తాజాగా ప్రొటెక్ట్ యువర్ ప్యూచర్ నినాదం ఎన్ఎఫ్ఒలను విడుదల చేసింది. ఇందులో సస్టెయినబల్ ఈక్విటీ ఫండ్ ఒకటి కాగా మరొకటి డైనమిక్ అడ్వాంటేజ్ ఫండ్. యూనిట్‌కు రూ.10తో ఎన్ఎవి వద్ద లభ్యమవుతాయని ఆ సంస్థ తెలిపింది. దీర్ఘకాలంలో మూల ధన వృద్ధిని అందిస్తాయని పేర్కొంది. వీటిలోని ఫండ్స్‌ను ప్రధానంగా సస్టెయినబుల్ లేదా పర్యావరణ, సామాజిక, పరిపాలన అనుకూల ప్రక్రియల రంగాల్లోని కంపెనీలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది.