Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో అత్యంత ప్రీమియం సినిమా ప్రదర్శన కంపెనీ పివిఆర్ ఐనాక్స్ రాష్ట్రంలో 106 స్క్రీన్లకు విస్తరించినట్లు తెలిపింది. ఆర్మూర్‌లో కొత్తగా నాలుగు స్క్రీన్ల మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడంతో ఈ స్థాయికి చేరినట్లు పేర్కొంది. ఇది రాష్ట్రంలో తమకు 19వ ప్రాపర్టీ అని వెల్లడించింది. దక్షిణాదిలో 94 ప్రాపర్టీలలో 523 స్క్రీన్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది. అత్యాధునిక టెక్నాలజీతో ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్‌లో 1254 మంది ప్రేక్షకుల సిట్టింగ్ సామర్థ్యం కలదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో కొత్తగా 24 నగరాల్లో 30 ప్రాపర్టీలలో 168 స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.