Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా కొత్తగా అమెరికాలోని వర్జీనియాలో తన అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ కన్స్యూమర్ హెల్త్ (జిసిహెచ్) ద్వారా ప్యాకేజింగ్ కేంద్రాన్ని ప్రారంభించి నట్లు వెల్లడించింది. అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న తరన్‌జిత్ సింగ్ సంధు దీన్ని లాంఛనంగా ప్రారంభించారని తెలిపింది. 79,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి ఇటీవల జీరో 483 అబ్జర్వేషన్లతో యుఎస్ ఎఫ్‌డిఎ ఆమోదం లభించిందని వెల్లడించింది. ఈ కొత్త సెంటర్ తమ సరఫరా గొలుసు సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని, వినియోగదారులకు వేగంగా సేవలను అందించడానికి వీలుందని గ్రాన్యూల్స్ ఇండియా సిఎండి డాక్టర్ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు.