Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్తగా దుబాయ్‌లోని గోల్డ్ సౌక్‌లో నూతన స్టోర్‌ను తెరిచినట్లు ప్రకటించింది. దీన్ని యుఎఇ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ మర్రీ ప్రారంభించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ నెట్వర్క్ 310 స్టోర్లకు విస్తరించినట్లు పేర్కొంది. తమ విశ్వసనీయ వినియోగదారులకు ఆదర్శప్రాయమైన ఆభర ణాల షాపింగ్ అనుభవాన్ని అందించిన 30 ఏండ్ల వార్షికోత్సవాల సంద ర్భంగా నూతన స్టోర్‌ను తెరవడం సంతోషంగా ఉందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఎండి షామ్లాల్ అహమ్మద్ పేర్కొన్నారు.