Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవ సమయంలో పాల నాణ్యతను ఖచ్చితత్త్వంతో విశ్లేషించేందుకు అత్యాధునిక సాంకేతికతను ఈ మిల్క్ ఎనలైజర్ వినియోగించుకుంటుంది
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ డెయిరీ సాంకేతిక పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఎవరెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తమ తాజా ఉత్పత్తి ఫ్యాట్స్కాల్ మిల్క్ ఎనలైజర్‌ను విడుదల చేసింది. ఈ ప్యాట్ స్కాన్ మిల్క్ ఎనలైజర్ విప్లవాత్మక సాంకేతికతను వినియోగించుకుని ఖచ్చితమైన, సమర్థవంతమైన విశ్లేషణను పాల నాణ్యత గురించి అందిస్తుంది. అత్యంత అందుబాటు ధరలో లభించే ఈ పరికరంతో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, జోడించిన నీరు, సాంద్రత, ప్రొటీన్, లాక్టోజ్‌ను % రూపంలో 30 సెకన్లలో పొందవచ్చు.
ఈ ఫ్యాట్స్కాన్ మిల్క్ ఎనలైజర్‌ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఛైర్మన్ మీనేష్ షా, ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ సోధి , అమూల్ డెయిరీ ఎండీ అమిత్ వ్యాస్, ఇంటర్షేనల్ డెయిరీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పియర్ క్రిస్టినో బ్రాజెల్ , సుప్రసిద్ధ టెక్నోక్రాట్స్, ఐడీఏ సభ్యులు మరియు డెయిరీ పరిశ్రమ ప్రతినిధులు సమక్షంలో విడుదల చేశారు.
‘‘ఈ ఫ్యాట్స్కాన్ మిల్క్ ఎనలైజర్ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ఖచ్చితమైన ఫలితాలను వాస్తవ సమయంలో పొందవచ్చు. దీనితో పాల ఉత్పత్తిదారులు మరియు ప్రాసెసర్లు పాల నాణ్యత పట్ల తగిన నిర్ణయాలను తీసుకుని తమ సామర్థఽ్యం, లాభాలను మెరుగుపరుచుకోగలరు. మిల్క్ ఎనాలిసిస్ పరిశ్రమను ఈ వినూత్నమైన సాంకేతికత విప్లవాత్మీకరించనున్నాము’’ అని అజిత్ పటేల్, మేనేజింగ్ డైరెక్టర్, ఎవరెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు.
‘‘ఇప్పటి వరకూ మిల్క్ ఎనలైజర్లను యూరోప్ నుంచి దిగుమతి చేసుకునే వారు. ఫ్యాట్స్కాన్ మిల్క్ ఎనలైజర్‌ను భారతదేశంలో అభివృద్ధి చేసి విడుదల చేశాము. పాలు , పాల పదార్ధాల నాణ్యతను మెరుగుపరచడంతో పాటుగా వినియోగదారులకు భద్రతను సైతం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నాము’’ అని పరిమల్ పటేల్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఎవరెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు. వినియోగదారులు అతి సులభంగా వినియోగించేలా సహజమైన డిజైన్ కలిగిన ఫ్యాట్ స్కాన్ మిల్క్ ఎనలైజర్ వినియోగదారులందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ పరికరాన్ని విభిన్న పరిస్ధితిలలో కూడా వినియోగించవచ్చు.