Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దక్షిణ భారతదేశంలో స్త్రీలు, పిల్లలకు అత్యంత అందుబాటు ధరలలో వైద్య సేవలను అందించడానికి అంకితం చేయబడిన సుప్రసిద్ధ హాస్పిటల్ లో లోటస్ హాస్పిటల్స్ ఒకటి. హైదరాబాద్‌లో లకడీకాపూల్ మరియు కూకట్‌పల్లితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న లోటస్ హాస్పిటల్స్, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి క్లీనికల్ మేనేజ్మెంట్తో సమగ్రమైన చికిత్స్యా విధానం అనుసరిస్తుంది.
అత్యంత గౌరవనీయమైన పీడియాట్రిషియన్లలో ఒకరైన డాక్టర్ వీఎస్వీ ప్రసాద్, 2006లో తొలి యూనిట్‌ను హైద్రాబాదులో ప్రారంభించి నవజాత శిశువులు,వారి తల్లులు, యుక్త వయసు పిల్లలకు వైద్య చికిత్సలను అందిస్తున్నారు . అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని లోటస్ హాస్పిటల్ నెల రోజుల పాటు విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహించింది. మహిళలకు స్ఫూర్తికలిగించేలా ఈ కార్యక్రమాలు ఉండటంతో పాటుగా , అన్ని వయసుల మహిళలల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించేందుకు తోడ్పడింది.
ఈ ప్రయత్నాలలో భాగంగా, లోటస్ హాస్పిటల్ తమ ప్రసూతి మరియు స్త్రీ సంబంధిత వ్యాధుల విభాగం లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను పునర్నిర్వచించింది. అత్యాధునిక సాంకేతికతతో రోగి మరియు కుటుంబ కేంద్రీకృత విధానం అనుసరిస్తుంది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభోత్సవంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ , మహిళా భద్రత, షీటీమ్స్, భరోసా (ఫ్యాక్) డైరెక్టర్, హైదరాబాద్– శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లకడీకాపూల్ వద్ద ఉన్న లోటస్ హాస్పిటల్లో మార్చి 31 ఉదయం 11.30 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరిగింది. మహిళల ఆరోగ్యం పై దృష్టి సారించి కాంప్లిమెంటరీ సభ్యత్వ కార్యక్రమంను ‘మదర్‌హుడ్ అండ్ బియాండ్ జర్నీ’ శీర్షికన విడుదల చేసింది. బర్తింగ్మరియు వెల్నెస్ ప్రయోజనాలను సైతం అదనంగా దీనితో పాటుగా అందిస్తున్నారు.
మెంబర్షిప్ కార్డ్ పరిచయంతో విభిన్నమైన ప్రయోజనాలను అందించడం ద్వారా లోటస్ హాస్పిటల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో భాగంగా అన్ని ఆరోగ్య ప్యాకేజీలపై 40% రాయితీని అందించడంతో పాటుగా ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న వారికి ప్రెగ్నెన్సీ ప్యాకేజీలపై కూడా రాయితీ అందిస్తున్నారు. దీనితో, లోటస్ హాస్పిటల్ తమ గైనకాలజికల్ యూనిట్‌ను పునః ప్రారంభించడంతో పాటుగా మాతృమూర్తులు, వారి కుటుంబసభ్యులకు అత్యుత్తమంగా సేవలను అందిస్తుంది. ఈ వార్డు అందించే చక్కటి అహ్లాదకరమైన , అత్యాధునిక సేవలతో గర్భవతులు అత్యుత్తమ ప్రయోజనాలు పొందగలరు.