Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పవర్ బ్యాకప్, రెసిడెన్షియల్ సోలార్ రంగంలోని లూమినస్ పవర్ టెక్నాలజీస్ కొత్తగా మార్కెట్లోకి అధిక సామర్థ్యం కలిగిన ఇన్వెర్టర్లను విడుదల చేసింది. శని వారం హైదరాబాద్లో వీటిని లూమి నస్ పవర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ గుంజ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామన్నారు. కంపెనీ నిరంతర ప్రయత్నాలలో భాగంగా వీటిని అందుబాటులోకి తెచ్చామన్నారు. పవర్ బ్యాకప్ పరిష్కారాల్లో తమకు 35 ఏండ్ల అనుభవం ఉందన్నారు. దాదాపు 10 కోట్ల కుటుంబాలు తమ ఉత్పత్తులను వినియోగిస్తున్నాయన్నారు.