Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెన్ జడ్ మరియు సహస్రాబ్ది యువతకు విలక్షణమైన, ఉత్కంఠభరితమైన గేమింగ్, స్మార్ట్‌థింగ్స్, కస్టమైజేషన్ మరియు వర్క్‌షాప్‌ల వంటి అనుభవాలను ఆఫర్ చేస్తుంది
- కొత్త ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లు, ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, పూణె మరియు చండీగఢ్ వంటి నగరాల్లో చారిత్రాత్మక ప్రదేశాల్లో నెలకొల్పటం జరుగుతుంది
- స్టోర్ల వద్ద నిర్వహించే పలు గెలాక్సీ వర్క్‌షాప్‌లు మరియు కార్యకలాపాల ద్వారా వినియోగదారులు శామ్సంగ్ @ వద్ద నేర్చుకోగలుగుతారు
నవతెలంగాణ - హైదరాబాద్
శామ్సంగ్, భారతదేశపు అతి పెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, 2023 ముగిసేనాటికి, భారతదేశ వ్యాప్తంగా అగ్రశ్రేణి మెట్రో నగరాల్లో 15 ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా, వినియోగదారుల కోసం ఉత్కంఠభరితమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, దేశంలో అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్‌లో ఒక ప్రమాణాన్ని సృష్టించనున్నది..
ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, పూణె మరియు చండీగఢ్ వంటి అగ్రశ్రేణి మెట్రో నగరాల్లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో ఈ సరికొత్త ఎక్స్పీరియన్స్ స్టోర్లు నెలకొల్పబడతాయి.
శామ్సంగ్ స్మార్ట్‌థింగ్స్, స్మార్ట్ఫోన్లు, ఆడియో, గేమింగ్, లైఫ్‌స్టైల్ స్క్రీన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ థియేటర్ మరియు వేరబుల్స్ వంటి ఉత్కంఠభరితమైన జోన్స్ ద్వారా, స్మార్ట్థింగ్స్తో తమ బహుళ-ఉపకరణాల అనుసంధాన్యతను ప్రదర్శించి, శామ్సంగ్ వారి సంపూర్ణ ఉత్పత్తుల ఈకోవ్యవస్థను ఈ స్టోర్స్ ప్రదర్శిస్తాయి. శామ్సంగ్ వారి అనుసంధిత లివింగ్ ఈకోవ్యవస్థ, వినియోగదారుల దైనందిన జీవితాల్లో ఏ విధంగా సౌకర్యాన్ని సృష్టించగలదో స్సార్ట్థింగ్స్ జోన్ ప్రదర్శించి చూపుతుంది. ఒక స్మార్ట్‌ఫోన్, రెఫ్రిజిరేటర్, ఎసి, హోమ్ థియేటర్, టివి మరియు ఇతర ఉపకరణాలు, ఒకదానితో ఒకటి ఏ విధంగా అనుసంధానమై, వినియోగదారులకు సౌకర్యాన్ని ఎలా అందజేస్తాయో ప్రత్యేకంగా తెలియచెప్పటం ఇందులో అంతర్భాగం. ఒక శామ్సంగ్ మానిటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచగలదో చూపటం, లేదా మీరు ఇంటికి చేరుకోకముందే మీ ఇల్లు చల్లబడి ఉండే విధంగా మీ ఎసిలను సుదూరం నుండే స్విచ్ ఆన్ చేసుకోవటమెలాగో చూపటం, లేదా ఒక హోమ్ కిచెన్ అనుభవం వంటి పరిస్థితులు, స్మార్ట్థింగ్స్లో చేర్చబడినాయి.
యువ గేమింగ్ ప్రియుల కోసం, ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్లలో ప్రత్యేకమైన గేమింగ్ జోన్లు ఉన్నాయి. అక్కడ వారు తమకు ఇష్టమైన గేమ్స్ మీద సమయాన్ని వెచ్చించవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల శక్తిని మరియు శామ్సంగ్ యొక్క అత్యుత్తమ ఒడిస్సీ ఆర్క్ గేమింగ్ మానిటర్ల శక్తిని, ఆడి తెలుసుకోగలుగుతారు. “మారుతున్న కస్టమర్ల అవసరాల పై ఎప్పటికప్పుడు దృష్టి సారించి ఉంచే ఒక బ్రాండుగా మేము, మా ఉత్తమ ఉత్పత్తులకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండటం గమనించాము. మా శామ్సంగ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ల వద్ద మా వినియోగదారుల్లో మూడింట రెండు వంతుల మంది వినియోగదారులు ప్రీమియం డివైస్‌నే ఎంచుకుంటున్నారు. పెరుగుతున్న ఈ వినియోగదారుల డిమాండును అందిపుచ్చుకోవటం కోసం మేము భారతదేశవ్యాప్తంగా 15 ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాము. శామ్సంగ్ వారు తయారు చేసిన ప్రీమియం ఉత్పత్తుల విస్తృతశ్రేణి పోర్ట్‌ఫోలియోను మరియు మా స్మార్ట్‌థింగ్స్ ఈకోసిస్టమ్, గేమింగ్, లైఫ్‌స్టైల్ స్క్రీన్లు, ప్రోడక్ట్ కస్టమైజేషన్ వంటి అనుభవాలను కూడా ఈ స్టోర్లు ఆఫర్ చేస్తాయి,” అని శ్రీ సుమిత్ వాలియా, సీనియర్ డైరెక్టర్, D2C బిజినెస్, శామ్సంగ్ ఇండియా చెప్పారు.
“ఈ ఉత్పత్తులు మరియు అనుభవాలు మా కస్టమర్లకు వ్యక్తిగతమైన మరియు సమ్మోహనాత్మకమైన శామ్సంగ్ సాంకేతికపరిజ్ఞానాన్ని చూసే అవకాశాన్ని మా కస్టమర్లకు అందించటమే కాక, వారు బ్రాండ్‌తో మరింత అర్ధవంతంగా అనుసంధానమయ్యేందుకు వారికి సహాయపడుతుంది,” అని ఆయన అన్నారు. వినియోగదారులు, ప్రత్యేకించి జెన్ జెడ్ మరియు సహస్రాబ్ది యువతకు, ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ల వద్ద, Learn @ Samsung కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పలు గెలాక్సీ వర్క్‌షాప్‌లు మరియు కార్యకలాపాలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఈ గెలాక్సీ వర్క్‌షాప్‌లు ఫోటోగ్రఫీ, వీడియో-ఎడిటింగ్, గేమింగ్, మ్యూజిక్, కోడింగ్, డూడ్లింగ్, బేకింగ్ మరియు పలు ఇతర అంశాలు, యువ వినియోగదారులు తమ పరస్పరాసక్తులను పెంపొందించుకునేందుకు సహకారం అందించటం, శామ్సంగ్ ఆవిష్కరణలను గురించి నేర్చుకోవటం, తమ స్మార్ట్ఫోన్లను మరియు ఇతర శామ్సంగ్ ఉత్పత్తులను మరింయ సమర్ధవంతంగా ఉపయోగించటం ఎలాగో ఈ గెలాక్సీ వర్క్‌షాప్‌లలో ప్రధానాంశాలు.
కస్టమైజేషన్ కౌంటర్ వద్ద, యువ వినియోగదారులు, స్టికర్లు మరియు ఇతర యాక్సెసరీలను ఉపయోగించి ఒక DIY స్మార్ట్‌ఫోన్ కవర్ కస్టమైజేషన్ అనుభవాన్ని పొందగలుగుతారు. శామ్సంగ్ వారి కొత్త ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లు, శామ్సంగ్ వారి స్టోర్+ అనంతమైన ఎయిల్ ప్లాట్‌ఫాంల ద్వారా ఫిజిటల్ అనుభవాన్ని కూడా ఆఫర్ చేస్తాయి. స్టోర్+ తో వినియోగదారులు, శామ్సంగ్ వారి 1,200లకు పైగా ఆప్షన్ల నుండి ఏదైనా శామ్సంగ్ ఉత్పత్తిని, అవి స్టోర్ల వద్ద అందుబాటులో లేకపోయినప్పటికీ, కొనగలుగుతారు. స్టోర్+ డిజిటల్ క్యాటలాగ్‌ను ఉపయోగించి వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఆ ఉత్పత్తి వారి ఇంటికి తిన్నగా డెలివర్ చేయబడుతుంది. శామ్సంగ్ వారి డిజిటల్ ఋణ వేదిక శామ్సంగ్ ఫైనాన్స్+ ను వినియోగదారులు యాక్సెస్ చేయగలుగుతారు. గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు మరియు స్మార్ట్‌వాచ్‌ల శామ్సంగ్ వారి డివైస్ కేర్ ప్లాన్‌ను, శామ్సంగ్ కేర్+ను స్టోర్స్ వద్ద వినియోగదారులు యాక్సెస్ చేయగలుగుతారు.
ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లను సందర్శించే వినియోగదారులు, ఎటువంటి చీకాకులు లేని విక్రయానంతర సేవలను తమ స్మార్ట్ఫోన్ల కోసం పొందగలుగుతారు మరియు ఇంటి వద్ద తమ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కోసం సర్వీస్ కాల్స్ బుక్ చేసుకోగలుగుతారు.
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్‌ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్‌లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్‌రూమ్ భారత్‌ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.