Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్సంగ్ వెల్లడి
గుర్గావ్ : ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 15 ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు సామ్సంగ్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ సహా అన్ని కీలక మెట్రో నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నామని పేర్కొంది. వీటిలో సామ్సంగ్ బహుళ ఉత్పత్తులను ప్రదర్శన, అమ్మకానికి ఉంచనుంది. ఈ స్టోర్లలో విని యోగదారుల కోసం ఉత్కంఠభరితమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు రావడంతో పాటుగా దేశంలోనే అత్యుత్తమ ఎలక్ట్రానిక్స్ ప్రమాణాలను నెలకొల్పనున్నట్టు తెలిపింది.