Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఆఫీసుల మూత
వాషింగ్టన్ : ప్రముఖ ఫాస్ట్ఫుడ్ రిటైల్ చెయిన్ సంస్థ మెక్డొనాల్డ్స్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ సంస్థ అమెరికాలోని అన్ని కార్యాలయాలను మూడు రోజుల పాటు మూసేసింది. భారీగా ఉద్యోగల తొలగింపు ప్రక్రియలో భాగంగా ఈ చర్యలకు దిగిందని రిపోర్టులు వస్తున్నాయి. తమ కార్పొరేట్ ఉద్యోగులు సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సంస్థలో ఉద్యోగుల విధులకు సంబంధించి కీలక నిర్ణయాలను వెల్లడిస్తామని ఆ సంస్థ తెలిపింది.
కాగా.. ఉద్యోగుల ఉద్వాసనపై ఏప్రిల్ 5న అధికారిక నిర్ణయం వెలువడనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థలో 1.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ఆర్థిక సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. దీంతో అనేక కంపెనీలు పొదుపు చర్యలను పాటిస్తున్నాయి. ఇదే బాటలో మెక్ డొనాల్డ్స్ ప్రయాణించనుందని రిపోర్టులు వస్తున్నాయి.