Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద విత్త సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో సోమవారం ఆ బ్యాంక్ ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంత రాయం చోటు చేసు కుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు పూర్తిగా సేవలు నిలిచిపోయాయి. ఎస్బీఐ యోనో యాప్, నెట్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ లావాదేవీలకు వీలు లేకుండా పోయింది. దీంతో ఖాతా దారులు డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని పలువురు ఖాతాదారులు సామాజిక మాధ్యమాల్లో తమ బాధను, ఆందోళనను వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం (2022-23) ముగింపు నేపథ్యంలో ఏప్రిల్ ఒక్కటో తేదిన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను అధికారికంగా నిలిపివేసింది. ఆ తర్వాత కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు పలువురు పేర్కొన్నారు.