Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహిత సమావేశాలు లేదా ఇంటి వద్ద భారీ ఇఫ్తార్ పార్టీలను జరుపుకునేందుకు పవిత్ర రంజాన్ మాసం ఒక అవకాశాన్ని అందిస్తుంది. కొత్త ఐకియా కలెక్షన్ గోక్వల్లా ఇంట్లో మీ రంజాన్ వేడుకలకు లేదా పండుగల కోసం మీ ఇంటిని అలంకరించుకునేందుకు అనువైనవి. ఈ కలెక్షన్ ఇస్తాంబుల్‌లోని ఐకానిక్ బ్లూ మసీదు, మొరాకో ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ ఎలిమెంట్స్ నుంచి పొందిన ప్రేరణతో తయారయ్యాయి. కలెక్షన్లో ప్లేటర్లు, సర్వింగ్ స్టాండ్లు, బౌల్స్ మరియు టీ ఉపకరణాల నుంచి సోఫా, ఫ్లోర్ కుషన్లు, కర్టన్లు మరియు ఇఫ్తార్ పార్టీ వేడుకలు లేదా ఈద్ సందర్భంగా ఇంట్లో అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు అనువైన త్రోలు ఉన్నాయి. ఈ కలెక్షన్ హైదరాబాద్, ముంబై మరియు బెంగళూరులోని ఐకియా (IKEA) స్టోర్లతో పాటు ఐకియా (IKEA) వెబ్సైట్ మరియు ఐకియా (IKEA) యాప్‌లో అందుబాటులో ఉంది.