Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
భారత రాజకీయాలలో ప్రభావవంతమైన గొంతుకలు ఏకం కాబోతున్నాయి. నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ భారత్ (ఎన్ఎల్సీ భారత్) అధికారికంగా దేశంలో మొట్టమొదటి మరియు అతిపెద్ద అసెంబ్లీని భారతదేశంలో దాదాపు 3వేల మందికి పైగా లెజిస్లేటర్స్తో నిర్వహించనుంది. దీనికి రిజిస్ట్రేషన్స్ తెరిచింది. అత్యంత భారీగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ముంబై నగరంలో 15 నుంచి 18 జూన్ వరకూ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు ఒకే వేదికపైకి రావడంతో పాటుగా నేడు మనదేశం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలను గురించి విస్తృతస్థాయిలో చర్చించవచ్చు.
పార్టీలకతీతమైన వేదిక ఎన్ఎల్సీ భారత్. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను ఇది ఏకతాటిపైకి తీసుకురానుంది. ఎన్నికైన అసెంబ్లీ సభ్యులకు తాము అనుసరిస్తున్న ప్రక్రియలను గురించి వెల్లడించడంతో పాటుగా వినూత్నమైన ఆలోచనలు సైతం పంచుకునేందుకు ఈ సమావేశం వీలు కల్పిస్తుంది. మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం , రాబోయే కాలంలో భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది.
‘భారతీయ ప్రజాస్వామ్యం మరియు పార్లమెంట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలనేది మా సమ్మిళిత ప్రపయత్నం. యువ రాజకీయ వేత్తలను ఏ విధంగా తీర్చదిద్దగలమనే సందేహానికి సైతం ఎన్ఎల్సీ తగిన పరిష్కారం అందించనుంది’’అని డాక్టర్ మీరా కుమార్, పూర్వ స్పీకర్, లోక్‌సభ మరియు ఎన్ఎల్సీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలు అన్నారు. ‘‘సమిష్టిగా దేశాన్ని నిర్మించే ప్రయత్నం ఈ ఎన్ఎల్సీ’’ అని రాహుల్ వి కరడ్, కన్వీనర్, ఎన్ఎల్సీ భారత్ అన్నారు. ‘‘ఈ సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎన్ఎల్సీ భారత్ కస్టోడియన్స్‌గా మాకు మద్దతు అందించనున్నారు. విభిన్న పార్టీలకు చెందిన విధాన నిర్ణేతలు పాల్గొనడం వల్ల మన ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది’’ అని అన్నారు.
ఎన్ఎల్సీ భారత్‌కు పలు రాష్ట్రాల లెజిస్లేటర్లు, గౌరవనీయ సీనియర్ బ్యూరోక్రాట్లు, పౌర సమాజ సభ్యులు మద్దతు అందిస్తున్నారు. ఎన్ఎల్సీ భారత్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులలో పూర్వ లోక్‌సభ స్పీకర్ లు శ్రీమతి సుమిత్ర మహాజన్, డాక్టర్ మీరా కుమార్, శ్రీ మనోహర్ జోషి, శ్రీ శివరాజ్ పాటిల్ మరియు ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఉన్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, భారతీయ ఛాత్ర సంసద్, అతుల్య భారత్ నిర్మాణ్ ఫౌండేషన్లు ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి.