Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- April ఏప్రిల్ 04, 2023 మొదలుకుని మే 31, 2023న సాయంత్రం 5 గంటల వరకు www.samsung.com/in/solvefortomorrow పై శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో కోసం దరఖాస్తు చేసుకోండి
- విద్య & బోధన, పర్యావరణం & సుస్థిరత, ఆరోగ్యం & సంక్షేమం మరియు వైవిధ్యం & చేర్పులకు సంబంధించిన ఆవిష్కారణాత్మక ఆలోచనలతో, 16-22 సంవత్సరాల వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు
- పాల్గొనేవారు శామ్సంగ్, IIT ఢిల్లీ & MeitY స్టార్టప్ హబ్ నుండి మార్గదర్శకత్వం & శిక్షణ పొందుతారు
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ రోజు ప్రారంభించిన శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో అనే తన జాతీయ విద్య మరియు ఆవిష్కరణ పోటీ రెండవ సీజన్ కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ వారి(ఎంఇఐటివై వారి) స్టార్టప్ హబ్ మరియు ఫోండేషన్ ఫర్ ఇనొవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ (ఎఫ్ఐటిటి), ఐఐటి ఢిల్లీ లతో భాగస్వామ్యాన్నిశామ్సంగ్ ఇండియా ప్రకటించింది. సాల్వ్ ఫర్ టుమారో ద్వారా శామ్సంగ్, భారతదేశపు యువతలో ఆవిష్కారణాత్మక ఆలోచనా సంస్కృతిని మరియు సమస్యా-పరిష్కార సంస్కృతిని పెంపొందించటానికి సంకల్పించింది.
శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, సెక్రటరీ, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మరియు శ్రీ జాన్ బుమ్ పార్క్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ, శామ్సంగ్ నైఋతి ఆసియా, ఇతర ప్రముఖుల సమక్షంలో శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో రెండవ సీజన్‌ను ప్రారంభించారు.భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వారి ఫ్లాగ్షిప్ సిఎస్ఆర్ కార్యక్రమం, ఆవిష్కరణాత్మక పరిష్కారాల శక్తిని, జీవితాలను మార్చగల, బలమైన సామాజిక ప్రభావాన్ని కలిగించగల సామర్ధ్యాన్ని గుర్తించి, శామ్సంగ్ వారి #పవరింగ్డిజిటల్ఇండియా విజన్‌ను బలోపేతం చేస్తుంది.
శామ్సంగ్ సాల్వ్ ఫర్ టిమారో మొదటి సీజన్ కోసం 2022లో, దేశమంతటి నుండి 18,000 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు యువత నుండి లభించాయి. ఒకటవ సీజన్లో గెలిచిన మూడు జట్లలో రెండు జట్లు తమ కంపెనీలను ప్రారంభించగా, ఒక జట్టు ఆ ప్రక్రియను ప్రస్తుతం నిర్వహిస్తోంది. ఈ ఏడాది, ఈ కార్యక్రమంలో భారతదేశంలోని 16-22 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఎవ్వరైననా పాల్గొనవచ్చు. ఇందుకోసం వారు, ప్రజల జీవితాలను మార్చగలిగిన తమ వినూత్నమైన టెక్-సుసాధ్యమైన ఆలోచనలను పంపాలి. ఈ ఆలోచనలు – విద్య మరియు బోధన, పర్యావరణం మరియు సంరక్షణ, ఆలోగ్యం మరియు సంక్షేమం, ఇంకా వైవిధ్యం మరియు చేర్పు – ఇతివృత్తాలకు సంబంధించినవి కావాలి. పాల్గొనాలనుకునేవారు, శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో కోసం www.samsung.com/in/solvefortomorrow పై ఏప్రిల్ 04, 2023 మొదలుకుని మే 31, 2023సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..
తమ ఆలోచనలను సాకారం చేసుకునేందుకు అగ్రశ్రేణి మూడు జట్లు రూ. 1.5 కోట్లను గెలుచుకుంటాయి. కాగా, ఇందులో పాల్గొని, టాప్ 30 మరియు టాప్ 10 దశలకు చేరుకునే ఇతర జట్లకు వివిధ దశల్లో బహుమతులను ఇవ్వటం జరుగుతుంది.
టాప్ 30 జట్లకు (వ్యక్తులు లేదా ముగ్గురు వరకు సభ్యలు కలిగిన జట్లు) శామ్సంగ్ భాగస్వాములు – ఫౌండేషన్ ఫర్ ఇనొవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ (ఎఫ్ఐటిటి) వారు ఇండియన్ ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ (ఐఐటి ఢిల్లీ) వద్ద మరియు ఎంఇఐటివై స్టార్టప్ హబ్ చే ఐఐటి ఢిల్లీ రెసిడెన్షియల్ బూట్‌క్యాంప్ వద్ద – శిక్షణ మరియు మార్గదర్శన లభిస్తుంది. ఇది వారికి, తమ ఆలోచనలను మరింత విస్తృతపరుచుకోవటానికి సహకరిస్తుంది. ప్రాథమిక ప్రోటోటైప్లను సృష్టించేందుకు వారి రూ. 20,000లు లభిస్తాయి. ఆ తర్వాత వారు తమ ఆలోచనలను శామ్సంగ్ యువ ఉద్యోగులు, ఎఫ్ఐటిటి, ఐఐటి ఢిల్లీ మరియు ఎంఇఐటివై స్టార్టప్ హబ్‌కు చెందిన న్యాయనిర్ణేతలకు ప్రదర్శించి చూపగలుగుతారు. ఫినాలే కోసం టాప్ 10 జట్లను ఈ న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేస్తుంది. ఈ జట్లకు శామ్సంగ్ ఇండియా కార్యాలయాలను, శామ్సంగ్ ఆర్ అండ్ డి కేంద్రాలను, డిజైన్ సెంటర్‌ను మరియు బెంగుళూరులోని శామ్సంగ్ ఒపేరా హౌస్‌ను సందర్శించే అవకాశం లభిస్తుంది. అక్కడ వారు శామ్సంగ్ యువ ఉద్యోగులు మరియు పరిశోధకులతో సంభాషించగలుగుతారు. టాప్ 10 జట్లకు అదనంగా రూ. 100,000 లభిస్తాయి. దీనితో వారు, ఫైనల్ పిచ్‌కు ముందు, తమ ప్రోటోటైప్లను మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. యువ శామ్సంగ్ ఉద్యోగుల మార్గదర్శన వారికి లభిస్తుంది. ఈ యువ శామ్సంగ్ ఉద్యోగులు, సాంకేతికపరిజ్ఞానం, డిజైన్, మార్కెటింగ్ మరియు పాలసీలతో సహా పలు రంగాల్లో, వారికి చేయూతనిస్తారు.
ఈ వార్షిక కార్యక్రమం మూడు జాతీయ విజేతలను ప్రకటించటంతో ముగుస్తుంది. వారికి బహుమతి రుసుముగా రూ. 1.5 కోట్లు గెలిచే అవకాశం మరియు ఉత్కంఠభరితమైన శామ్సంగ్ ఉత్పత్తులు లభిస్తాయి. శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, కార్యదర్శి, MeitY, ఇలా అన్నారు, “దేశంలో ఉత్తేజవంతమైన ఆవిష్కరణాత్మక ఈకోవ్యవస్థ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలని, యువత అందులో ప్రధాన కేంద్రం కావాలన్నది భారత ప్రభుత్వం యొక్క ఆశయం. యువత తమ ఆలోచనలను వాస్తవం చేసుకునేందుకు, తమ ప్రస్థానంలో వారు బలమైన సామాజిక ప్రభావాన్ని కలిగించటానికి అవసరమైన యావత్తు సహకారం మరియు మార్గదర్శన వారికి కావాలి. శామ్సంగ్, ఐఐటి ఢిల్లీ మరియు MeitY స్టార్టప్ హబ్‌లు సాల్వ్ ఫర్ టుమారో కార్యక్రమం కోసం కలిసి ముందుకు రావటం మా ఈ ఆశయాన్ని నిజం చేసుకునే దిశలో ఒక ముందడుగు.”
శ్రీ జోంగ్బుమ్ పార్క్, ప్రెసిడెంట్ & CEO, శామ్సంగ్ నైఋతి ఆసియా, ఇలా అన్నారు, “శామ్సంగ్లో మేము ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తాము, మార్పు తేగలిగిన ఆలోచనలు మరియు సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపుదిద్దుతాము. తదుపరి తరం ఆవిష్కర్తలు మరియు సంస్కర్తలను ప్రోత్సహించటమే మా వ్యాపారం. శామ్సంగ్ సాల్వ్ ఫర్ టిమారో మొదటి సీజన్లో మాకు లభించిన ఎంట్రీలు, భారతదేశపు యువత మనోఫలకాల్లో ఉన్న ఆందోళనలు మరియు సమస్యలకు సంబంధించిన ఒక విలక్షణమైన ముఖచిత్రం మాకు అందించింది. వ్యర్ధపదార్ధాల యాజమాన్యం, విద్యుత్తు మరియు నీటి వ్యర్ధం, ప్లాస్టిక్ వ్యర్ధం, స్పీచ్ దోషాలు మరియు మహమ్మారిని ముందుగా అంచనా వేయగలగటం మరియు కొత్త-తరం సాంకేతిక పరిజ్ఞానాలైన రోబోటిక్స్, కృత్రిమ మేథస్సు మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి పరిజ్ఞానాలను వాడే పరిష్కారమార్గాల వైపు వారి దృష్టి ఉన్నది.”
“తాము జీవించే సమాజాలను ప్రభావితం చేసే వాస్తవ-జీవితానికి సంబంధించిన సమస్యల్లో యువతకు పాత్ర కల్పిస్తే, వారు ప్రపంచంలో సృష్టించగల తొలిమార్పును చూడగలిగే అవకాశం వారికి లభిస్తుంది. శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారోతో మేము, యువతకు ఆ అవకాశాన్ని ఇవ్వదలుచుకున్నాము. అంతే కాక, దేశంలో ఆవిష్కరణాత్మక ఈకోవ్యవస్థలో పాత్ర పోషించి, పటిష్టం చేయాలని భావిస్తున్నాము. తద్వారా, డిజిటల్ ఇండాను సశక్తం చేయాలన్న (పవరింగ్ డిజిటల్ ఇండియా) ప్రభుత్వ సంకల్పాన్ని మరియు మా స్వంత సంకల్పాన్ని కూడా ముందుకు తీసుకుపోగలుగుతాము,” అని ఆయన అన్నారు.
శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో మొదటి సీజన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న యువత నుండి 18,000లకు పైగా రిజిస్ట్రేషన్లు లభించాయి. గెలిచినవారిలో 22 ఏళ్ళ బెంగుళూరు యువకుడు స్పుత్నిక్ బ్రెయిన్ వారి శంకర్ శ్రీనివాసన్, సురక్షితమైన బ్రెయిన్ మాడ్యులేషన్‌ను ఉపయోగించి ఒత్తిడిని తగ్గించటంలో సహకరించగల ఒక ధరించగల ఉపకరణాన్ని (వేరబుల్ డివైస్‌ను) తయారు చేశారు. కాగా, పోర్ట్‌బ్లేయర్ మరియు ఢిల్లీలకు చెందిన 16 ఏళ్ళ వయసు కలిగిన ముగ్గురు అమ్మాయిలు - ప్రీషా దూబె, అనుప్రియ నాయక్ మరియు వనలికా కోఁవర్లతో కూడిన ఉడాన్ బృందం, పర్యావరణానుకూలమైన, అందుబాటు ధరలో లభించే మరియు ఉతికి తిరిగి ఉపయోగించుకోగలిగిన, చెరకు పిప్పితో తయారు చేసిన శానిటరీ ప్యాడ్లను ప్రదర్శించారు. హైదరాబాద్ నుండి ఆల్ఫా మానిటర్‌కు చెందిన 16 ఏళ్ళ హిమేష్ ఛదలవాడ, అల్జమీర్స్ రోగులను పర్యవేక్షించగలిగేందుకు ఒక స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్ తయారు చేశారు. ఈ రిస్ట్‌బ్యాండ్, అల్జమీర్స్ రోగుల సంరక్షకులకు, రోగుల ప్రవర్తనలో మార్పులను గురించి హెచ్చరికలను ఇస్తుంది. “శామ్సంగ్ తో భాగస్వామ్యం, తద్వారా యువ ఆవిష్కర్తలు, సాల్వ్ ఫర్ టుమారో పోటీ ద్వారా వాస్తవ సమస్యల విషయంలో తమ ఆలోచనలను సాకారం చేసుకునే అవకాశాన్ని పొందగలిగేట్లు చేయటం మాకు ఆనందాన్నిస్తోంది,” అని ప్రొ. రంగన్ బెనర్జీ, డైరెక్టర్, ఐఐడి ఢిల్లీ అన్నారు.
“భారతదేశవ్యాప్తంగా ఉన్న యువతలో గొప్ప ప్రతిభ ఉన్నది, ప్రత్యేకించి చిన్న పట్టణాలు మరియు గ్రామాల్లో ఉండే యువతకు. మనం ఈ రోజు ఎదుర్కుంటున్న సంక్లిష్టమైన సమస్యలకు విలక్షణమైన పరిష్కారాలను కనుగొనే సామర్ధ్యం వారికి ఉన్నది. యువతకు శిక్షణను ఇచ్చి, వారు సరికొత్త శిఖరాలను అందుకోవటంలో సహకరించేందుకు సాల్వ్ ఫర్ టుమారో కార్యక్రమంలో శామ్సంగ్తో కలిసి పని చేసేందుకు మేము ఎదురుచూస్తున్నాము.,” అని శ్రీ జీత్ విజయ్, సిఇఒ, MeitY స్టార్టప్ హబ్ అన్నారు.
శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారోను గురించి
ఎవరు పాల్గొనగలుగుతారు: 16-22 ఏళ్ళ వయసు కలిగినవారు, వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ముగ్గురి వరకు (3) సభ్యులు కలిగిన జట్టుగా అప్లికేషన్ థీమ్స్ (ఇతివృత్తాలు): విద్య & బోధన, పర్యావరణం & సంరక్షణ, ఆరోగ్యం & సంక్షేమం మరియు వైవిధ్యం & చేర్పు వారు ఏమి పొందుతారు: ఆన్లైన్ శిక్షణ, ఐఐటి ఢిల్లీ వద్ద బూట్ క్యాంప్, శామ్సంగ్, ఐఐటి ఢిల్లీ మరియు ఎంఇఐటివై స్టార్టప్ హబ్ నుండి మార్గదర్శన మరియు శిక్షణ విజేతలకు ఏమి లభిస్తుంది: 3 విజేతల జట్లకు మొత్తం రూ. 1.5 కోట్లు మరియు వారి ఉత్పాదకతను పెంపొందించే ఉత్కంఠభరితమైన శామ్సంగ్ ఉత్పత్తులు. వారు ఎక్కడ దరఖాస్తు చేయగలుగుతారు: www.samsung.com/in/solvefortomorrow
ఎప్పటి నుండి: ఏప్రిల్ 04, 2023 మొదలుకుని
ఎప్పటి వరకు: మే 31, 2023 సాయంత్రం 5 గంటల వరకు
ప్రోగ్రామ్ వివరాలు
దరఖాస్తు విండో– ఒకటవ రౌండ్
వ్యక్తులు లేదా ముగ్గురి వరకు సభ్యులు కలిగిన జట్లు తమ దరఖాస్తులను www.samsung.com/in/solvefortomorrow, పై సమర్పించగలరు. అక్కడ వారు ఇతివృత్తాని ఎంచుకుని, వారు పరిష్కరిస్తున్న సమస్యను గురించి, వారు ప్రతిపాదిస్తున్న పరిష్కారమార్గం మరియు దాని సామాజిక ప్రభావాన్ని గురించి వివరంగా చెప్పగలుగుతారు. FITT, IIT ఢిల్లీకి చెందిన, ఆయా విషయాలలో నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతలు, లభించిన దరఖాస్తుల నుండి టాప్ 30 జట్లను ఎంపిక చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తమంగా వినియోగించుకోవటం (యాప్, ఉత్పత్తి లేదా సర్వీస్), సృజనాత్మకత, ఆలోచన యొక్క వాస్తవికత, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారమార్గాన్ని అమలు చేయటానికి సుసాధ్యత, సమాజం మీద లేదా పర్యావరణం మీద సానుకూల ప్రభావశీలత, మరియు ఎవరి కోసం ఆ పరిష్కారమార్గం ఉద్దేశించబడిందో వారిని చేరుకోగల సామర్ధ్యం – వంటి ప్రమాణాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఐడియా అభివృద్ధి – రెండవ రౌండ్
ఈ రౌండ్లో, ఎంపిక చేసిన టాప్ 30 జట్లు, ఐఐటి ఢిల్లీ క్యాంపస్‌లో జరిగే ఐదు రోజుల బూట్క్యాంపు హాజరవుతారు. ఈ బూట్‌క్యాంప్‌లో వారికి డిజైన్ థింకింగ్ గురించి ఎఫ్ఐటిటి, ఐఐటి ఢిల్లీ నుండి, ఆవిష్కరణ & IPR, పేటెంట్లను గురించి MeitY స్టార్టప్ హబ్ నుండి శిక్షణ లభిస్తుంది.
ప్రతి జట్టుకు, ప్రాథమిక ప్రోటోటైపలను సృష్టించేందుకు మరియు ఆ తర్వాత శామ్సంగ్ యువ ఉద్యోగులు మరియు ఎఫ్ఐటిటి, ఐఐటి ఢిల్లీ, ఎంఇఐటివై స్టార్టప్ హబ్ మరియు అటల్ ఇనొవేషన్ మిషన్‌కు చెందిన నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతల బృందానికి తమ ఆలోచనలను బూట్‌క్యాంప్ వద్ద సమర్పించేందుకు రూ. 20,000 లభిస్తాయి. ఆ న్యాయనిర్ణేతల బృందం టాప్ 10 జట్లను ఎంపిక చేస్తుంది.
ఈ 30 జట్లు, శామ్సంగ్ ఇండియా కార్యాలయాలు, వాటి R&D కేంద్రాలు, డిజైన్ సెంటర్ మరియు బెంగుళూరులోని శామ్సంగ్ ఒపేరా హౌస్‌ను కూడా సందర్శించి, శామ్సంగ్ యువ ఉద్యోగులు మరియు పరిశోధకులతో సంభాషించగలుగుతారు. టాప్ 30 జట్లకు చెందిన ప్రతి సభ్యునికి బూట్‌క్యాంప్ హాజరైనందుకు సర్టిఫికెట్ లభిస్తుంది, ఒక శామ్సంగ్ గెలాక్సీ ల్యాప్‌టాప్ మరియు గెలాక్సీ బడ్స్ లభిస్తాయి..
ఫైనల్ ప్రోటోటైప్ నిర్మాణం – ముడవ రౌండ్
ఈ రౌండ్లో, టాప్ 10 జట్లకు, న్యాయనిర్ణేతల బృందం సభ్యులు మరియు మార్గదర్శకుల నుండి లభించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తమ ప్రోటోటైప్లను అభివృద్ధిపరుచుకునేందుకు రూ. 100,000 లభిస్తాయి. వివిధ రంగాలకు చెందిన శామ్సంగ్ ఉద్యోగుల నుండి మరియు ఐఐటి ఢిల్లీకి చెందిన డొమెయిన్ నిపుణుల నుండి కూడా వారికి మార్గదర్శన లభిస్తుంది.
ఈ రౌండు ముగిసేటప్పటికి, జట్లు తమ ది ప్రోటోటైప్లను సమర్పిస్తాయి, ఒక లైవ్ ప్రెజెంటేషన్‌కు సంసిద్ధమవుతాయి. ఈ సందర్భంగా వారు తమ ఆలోచనలను, ప్రాజ్ఞులైన న్యాయనిర్ణేతల సమక్షంలో ఫినాలె ఈవెంట్లో ప్రదర్శిస్తారు. టాప్ 10 జట్లలో ప్రతి సభ్యునికి ఒక సర్టిఫికెట్ మరియు శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ లభిస్తాయి.
శామ్సంగ్ సాల్వ్ ఫర్ టుమారో సీజన్ రెండులో గెలిచే టాప్ 3 జట్లు, మొత్తం రూ. 1.5 కోట్ల బహుమతి మొత్తాన్ని గెలుచుకుంటాయి. తద్వారా వారు తమ ఆలోచనలను సాకారం చేసుకునే దిశలో ఒక అడుగు ముందుకువేసి, విద్య & బోధన, పర్యావరణం & పరిరక్షణ, ఆరోగ్యం & సంక్షేమం మరియు వైవిధ్యం & చేర్పు ఇతివృత్తాలలో భారతదేశం ఎదుర్కుంటున్న ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాలను సాధించటంలో సహకరిస్తారు. అమెరికాలో మొదటిసారి 2010లో ప్రారంభించిన సాల్వ్ ఫర్ టుమారో, ప్రస్తుతం అంతర్జాతీయంగా 63 దేశాల్లో నిర్వహించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇందులో 2.3 మిలియన్ మంది యువత పాల్గన్నారు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు, భారతదేశంలో పోటీ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు సందర్శించండి www.samsung.com/in/solvefortomorrow. దరఖాస్తుల ఎంట్రీ మే 31, 2023 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.