Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : విదేశీ రుణాల కోసం అదాని గ్రూపు ప్రయత్నాలు చేస్తోం దని సమాచారం. ఇందుకోసం అదానీకనెక్స్ జాయింట్ వెంచర్ రుణం కోసం పలు విదేశీ బ్యాంకులతో చర్చలు జరిపిందని రిపోర్టులు వస్తున్నా యి. అదాని గ్రూపు తీవ్ర ఆర్థిక అవకతవకలు, ఎకౌంట్స్ మోసాలు, కృత్రి మంగా షేర్ల ధరలను పెంచుకుంటుందన్న హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదాని కంపెనీ తొలి సారి అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నమిది. డేటా సెంటర్ ప్రొవైడర్ ఎడ్జ్కనెక్సతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ విదేశీ రుణాలను సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. 220 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,800 కోట్లు) రుణం కోసం పలు బ్యాంక్‌లతో చర్చలు జరుపుతోందని ఈ అంశంతో సంబంధం కలిగిన ఇద్దరు ఉద్యోగులు పేర్కొన్నట్లు తెలిపింది.