Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఉత్పత్తికి 2022లో ఉన్న విస్త్రతమైన డిమాండ్ తో మొత్తం 432 యూనిట్స్ విక్రయించింది
- యాక్ససబిలిటి మరియు ప్రీమియత్వం పై దృష్టి కేంద్రీకరించడం వలన 44 పట్టణాలలో 60 అవుట్ లెట్స్ కు డీలర్ నెట్ వర్క్ వ్యాపించింది
- ఇప్పటికే ఉన్న 15 డీలర్ షిప్స్ నుండి అన్ని 60 అవుట్ లెట్స్ కు 150 kW అత్యధిక వేగవంతమైన ఛార్జర్ నెట్ వర్క్ ను విస్తరణకు ప్రణాళిక చేసింది.
నవతెంగాణ - హైదరాబాద్
అంతర్జాతీయంగా ప్రశంసించబడిన మరియు ప్రీమియం ఆఫరింగ్ - 2023 కియా ఈవీ6 కోసం బుక్కింగ్స్ ను త్వరలోనే ఆరంభించనున్నట్లు కియా ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఈవీ 6 ఆవిష్కరించబడిన కేవలం ఏడు నెలలు లోగా భారతదేశంలో ఉత్తమంగా విక్రయించబడే ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనంగా మారింది. ఈవీ6తో కియా తమ విద్యుద్దీకరణ ప్రయాణాన్ని గత ఏడాది జూన్ 2022లో ఆరంభించింది మరియు 432 మంది సంతృప్తికరమైన కస్టమర్స్ కు ప్రోడక్ట్ ను డెలివరీ చేసి 2022 సంవత్సరాన్ని ముగించింది. గత ఏడాది అంతర్జాతీయ సరఫరా సమస్యలు వలన దీర్ఘకాలం వేచి ఉండే సమయం ఉన్నా కూడా, కియా ఈవీ 6 కోసం తమ సేల్స్ సంఖ్యలను ఏడు నెలల రికార్డ్ సమయంలో నిర్వహించింది. కస్టమర్స్ నుండి వచ్చిన అనూహ్యమైన ప్రతిస్పందన వలన భారతదేశపు మార్కెట్ కోసం అసలుగా ప్రణాళిక చేసిన సంఖ్యలు కంటే అంతిమ డెలివరీల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా వచ్చింది. ఈ ఊహించలేని డిమాండ్ ఈవీ6 యొక్క నాజూకైన డిజైన్, ప్రభావితపరిచే సామర్థ్యం, మరియు ఆధునిక ఫీచర్స్ కు సాక్ష్యంగా నిలిచింది. ఈ చర్య సుస్థిరమైన సంచార నాయకునిగా మారే కియా ఇండియా ప్రయాణానికి ప్రముఖంగా దోహదపడింది.
కియా ఈవీ6 ప్రతిష్టాత్మకమైన 'గ్రీన్ కార్ అవార్డ్ 2023'ని ఐసీఓటీవై నుండి, 2023 నార్త్ అమెరికన్ యుటిలిటి వెహికిల్ ఆఫ్ ది ఇయర్, 2022 యూరోపియర్ కార్ ఆఫ్ ది ఇయర్, 2022 కొరియన్ కార్ ఆఫ్ ది ఇయర్, 2022 కార్ ఆఫ్ ది ఇయర్ & రెడ్ డాట్ అవార్డ్స్ లో ఎస్ యూవీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలను పొందింది. ఈ పురస్కారాలు ఈవీ6 యొక్క డిజైన్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణ శ్రేష్టతను, ఆధునిక కస్టమర్స్ కు సుస్థిరమైన సంచార పరిష్కారాన్ని అందించే తమ బాధ్యతను సంబరం చేస్తుంది.
శ్రీ. తే-జిన్ పార్క్, ఎండీ & సీఈఓ, కియా ఇండియా, ఇలా అన్నారు, "మా మొదటి ప్రీమియం ఈవీ ఆఫరింగ్ కు వచ్చిన ప్రతిస్పందనకు మేము ఉల్లాసోత్సాహంగా ఉన్నాము, ఇది డిజైన్ మరియు టెక్నాలజీ అద్భుతంగా తనను స్థిరపరచుకుంది మరియు ఆవిష్కరించడిన నాటి నుండి బహుళ పురస్కారాలు గెలుచుకుంది. సుస్థిరత, విద్యుద్దీకరణకు మా నిబద్ధతకు చిహ్నంగా, తమ మొదటి సంవత్సరంలో ఉత్తమంగా విక్రయించబడే ప్రోడక్ట్స్ లో ఒకటిగా మారడం ద్వారా చరిత్ర సృష్టించింది. మరింత సుస్థిరమైన భవిష్యత్తు దిశగా నాయకత్వంవహిస్తున్నందుకు గర్విస్తున్నాము మరియు మా వ్యాపారాన్ని పెంచడానికి విభాగాన్ని వృద్ధి చేయడాన్ని మేము కొనసాగిస్తాము." ఆయన ఇంకా ఇలా అన్నారు, "ఈ సంవత్సరం కోసం, మా డీలర్ నెట్ వర్క్ ను విస్తరించడం ద్వారా గత ఏడాది ఈ ప్రీమియం కొనుగోలు చేయలేకపోయిన కస్టమర్స్ కు సేవలు అందించడానికి మరిన్న ప్రోడక్ట్స్ ను ఎగుమతి చేయడం మేము దృష్టిసారిస్తున్నాము. ఈవీ 6 మార్కెట్ లో తమ వైభవోపేతమైన సామర్థ్యంతో ప్రీమియం ఈవీ విభాగానికి నాయకత్వం వహించడాన్ని కొనసాగిస్తుంది."
కియా వారి ప్రత్యేకమైన ఈవీ ప్లాట్ ఫాం పై నిర్మితమైన, ఎలక్ట్రిక్ -గ్లోబల్ మాడ్యులార్ ప్లాట్ ఫాం (ఈ-జీఎంపీ), ఈవీ 6 ప్రస్ఫుటమైన డిజైన్, ప్రగతిశీలకమైన ఇంజనీరింగ్, కొత్త టెక్నాలజీలు మరియు ఉత్తేజభరితమైన ఎలక్ట్రిక్ పనితీరులు యొక్క అద్భుతమైన కలయిక మరియు కియా ఈవీ6 దేశంలో కియా వారి సుస్థిరమైన సంచార ప్రయాణం ఆరంభించడానికి గుర్తుగా నిలిచింది. ఈవీ6 అద్భుతమైన పనితీరును, అత్యంత వేగవంతమైన డీసీ ఛార్జింగ్, వెహికిల్ టు లోడ్ (వీ2ఎల్) ఫంక్షనాలిటీని మరియు కేబిన్ అంతటా సుస్థిరమైన - స్నేహపూర్వకమైన మెటీరియల్స్ ను వినియోగించే ఫ్లాట్-ఫ్లోర్ ఇంటీరియర్ ను అందించింది. కియా ఈవీ6 ఆధునిక డ్రైవర్ సహాయ వ్యవస్థలను అందించింది, ఊహించలేని కనక్టివిటి మరియు భద్రతల స్థాయిని చేర్చింది. వాహనం అత్యంత ప్రభావితపరిచే ఏఆర్ఏఐచే ధృవీకరించబడిన 708 కిమీ శ్రేణిని, అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను, విశాలమైన, హై-టెక్ ఇంటీరియర్ ను కలిగి ఉంది. కియా ఈవీ6 అయిదు ఉత్తేజభరితమైన రంగులలో లభిస్తోంది - రన్ వే రెడ్, యాట్ బ్లూ, మూన్ స్కేప్, ఔరోరా బ్లాక్ పెరల్, మరియు స్నో వైట్ పెరల్.
ఆగస్ట్ 22లో, కంపెనీ హరిత టెక్నాలజీని ప్రోత్సహించడానికి భారతదేశపు మొదటి మరియు అత్యంత వేగవంతమైన 240kWh ఛార్జర్ ను ఇన్ స్టాల్ చేసింది. ఆరంభించిన సమయంలో తమ ఈవీ డీలర్ ఫుట్ ప్రింట్ ను 12 పట్టణాలలో 15 ఎంపిక చేసిన డీలర్ షిప్స్ నుండి 44 పట్టణాలలో 60 అవుట్ లెట్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేసింది. అన్ని 60 అవుట్ లెట్స్ కు ఇప్పటికే ఉన్న 15 డీలర్ షిప్స్ నుండి 150 kW అత్యంత వేగవంతమైన ఛార్జర్ నెట్ వర్క్ కు విస్తరించడానికి కూడా కియా ఇండియా ప్రణాళిక చేసింది.
2023 కియా ఈవీ6 రెండు రకాలలో లభిస్తోంది : జీటీ లైన్ మరియు జీటీ లైన్ ఏడబ్ల్యూడీ. ఇవి వరుసగా రూ. 60.95 లక్షలు మరియు రూ. 65.95 లక్షలకు లభిస్తున్నాయి.
కియా-ఇండియా గురించి
అనంతపురం జిల్లాలో తయారీ సదుపాయం నిర్మించడానికి 2017 ఏప్రిల్ లో, కియా ఇండియా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) పై సంతకం చేసింది. 2019 ఆగస్ట్ లో కియా పెద్ద మొత్తంలో ఉత్పత్తి ఆరంభించింది మరియు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 300,000 యూనిట్లు సాధించింది. 2021 ఏప్రిల్ లో, కియా ఇండియా ఆధునిక ప్రోడక్ట్స్ మరియు సేవల మద్దతు ద్వారా కస్టమర్స్ కు అర్థవంతమైన అనుభవాలను అందచేసే లక్ష్యంతో తమ కొత్త బ్రాండ్ గుర్తింపు, ప్రేరేపించే సంచారానికి అనుగుణంగా తనను పునః చిత్రీకరించుకుంది. కొత్త బ్రాండ్ గుర్తింపు క్రింద, కియా కొత్త ప్రమాణాలు సాధించడానికి మార్గాలను కనుగొనడానికి మరియు విజయాలు సాధించడానికి వినియోగదారులను ప్రేరేపించడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు, కియా ఇండియా భారతదేశపు మార్కెట్ కోసం 5 వాహనాలను విడుదల చేసింది- ద సెల్టోస్, ద కార్నివాల్, ద సోనెట్, ద కారెన్స్, మరియు ఈవీ6. కియా ఇండియా అనంతపురం ప్లాంట్ నుండి 8.89 లక్షలకు పైగా పంపిణీ చేసింది, వీటిలో 6.93 లక్షల దేశీయ సేల్స్ మరియు 1.96 లక్షలకి పైగా ఎగుమతులు ఉన్నాయి. భారతదేశపు రోడ్లు పై 2.99 లక్షలకు పైగా కనక్టెడ్ కార్స్ తో, దేశంలో ఇది కనక్ట్ చేయబడిన కారు నాయకులలో ఒకటిగా ఉంది. 213 పట్టణాలలో బ్రాండ్ కు విస్త్రతమైన 425 టచ్ పాయింట్స్ నెట్ వర్క్ ఉంది మరియు దేశవ్యాప్తంగా తన ఉనికిని శక్తివంతం చేయడం పై దృష్టిసారించింది.
కియా కార్పొరేషన్ గురించి
కియా (www.kia.com) అంతర్జాతీయంగా సంచరిస్తున్న బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, సమాజాలు, వర్గాలకు సుస్థిరమైన ప్రయాణం పరిష్కారాలను తయారు చేయాలని కలలు కంటున్న బ్రాండ్. 1944లో స్థాపించబడిన, కియా 75 సంవత్సరాలకు పైగా ప్రయాణ పరిష్కారాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 52,000 మంది ఉద్యోగులతో, 190 మార్కెట్లలో తన ఉనికితో, ఆరు దేశాలలో తయారీ సదుపాయాలతో, కంపెనీ నేడు సుమారు మూడు మిలియన్ వాహనాలను ఏటా విక్రయిస్తుంది. కియా ఎలక్ట్రిపైడ్ మరియు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నిస్తోంది మరియు ప్రయాణ సేవలు యొక్క పెరుగుతున్న శ్రేణిని అభివృద్ధి చేస్తోంది, ప్రయాణించడానికి ఉత్తమమైన విధానాలు అన్వేషించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రజలను ప్రోత్సహిస్తోంది. కంపెనీ వారి బ్రాండ్ నినాదం - 'ప్రేరేపించే సంచారం' - తన ప్రోడక్ట్స్ మరియు సేవలు ద్వారా వినియోగదారులను ప్రేరేపించడానికి కియా యొక్క కట్టుబాటును ప్రతిబింబిస్తోంది. మరింత సమాచారం కోసం, కియా గ్లోబల్ మీడియా సెంటర్ ను www.kianewscenter.com పై చూడండి.