Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కియా ఇండియా తన కియా ఇవి6 బుకింగ్స్‌ను ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రీమియం విద్యుత్ వాహనాన్ని రెండు వేరియింట్లలో విడుదల చేసింది. జిటి లైన్, జిటి లైన్ ఎడబ్ల్యుడి వర్షన్ల ధరలను వరుసగా ఎక్స్‌షోరూం ధరను రూ.60.95 లక్షలు, రూ.65.95 లక్షలుగా నిర్ణయించింది. ''దీని డిజైన్, టెక్నాలజీ అద్భుతంగా ఉంటుంది. అంతర్జాతీయంగా దీన్ని ఆవిష్కరించిన్పటి నుంచి బహుళ పురస్కారాలు గెలుచుకుంది. విద్యుత్ వాహనాల్లో చరిత్ర సృష్టించింది. మా వ్యాపారాన్ని పెంచడానికి, ఈ విభాగాన్ని వృద్ధి చేయడాన్ని మేము కొనసాగిస్తాం'' అని కియా ఇండియా ఎమ్డీ, సీఈఓ తే జిన్ పార్క్ పేర్కొన్నారు.