Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జీవన వ్యయాలు పెరిగిపోవడంతో ప్రజలు ఖర్చులకు బెంబేలెత్తుతున్నారు. తమ వ్యక్తిగత ఫైనాన్స్ పరిస్థితులపై 74 శాతం మంది భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పిడబ్ల్యూసి గ్లోబల్ కన్స్యూమర్ ఇన్సైట్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. ఇది అంతర్జాతీయ సగటు 50 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. నిత్యవస రేతర వ్యయాలను తగ్గించుకుంటున్నామని 63 శాతం భారతీయులు పేర్కొన్నారు. దేశంలోని 25 ప్రాంతాల్లోని 9,180 మంది అభిప్రాయా లను సేకరించి.. ఈ రిపోర్టును రూపొందించినట్లు పిడబ్ల్యూసి గ్లోబల్ పేర్కొంది. ఇందులో కీలక మెట్రో నగరాలతో పాటు హైదరాబాద్, విశాఖపట్నంకు చెందిన వారూ ఉన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు పెద్ద సమస్యగా నెలకొన్నాయని 50 శాతం మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ కొనుగోళ్ల డాటా ప్రైవెసీపై 65 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.