Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెలోరా సిఇఒ సరోజా యెర్రమిల్లి
హైదరాబాద్ : తేలికపాటి పసిడి ఆభరణాలను విక్రయించే మెలోరా తమ స్టోర్లను ద్వితీయ శ్రేణీ నగరాలకు విస్తరిస్తామని వెల్లడిం చింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూతన స్టోర్‌ను గురువారం ఆ సంస్థ ఫౌండర్, సిఇఒ సరోజా యెర్రమిల్లి లాంఛనంగా ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సరోజా మీడియాతో మాట్లాడుతూ.. ఇది తెలంగాణలో తమకు తొలి అవుట్లెట్ అని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయన్నారు. వచ్చే ఐదేండ్లలో ఫ్రాంచైజీ పద్ధతిలో 500 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాల్లో స్టోర్లను అందుబాటులోకి తేనున్నామన్నారు. హైదరాబాద్‌లో ఐదు స్టోర్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.700 కోట్ల టర్నోవర్ సాధించామ న్నారు. గడిచిన నాలుగేండ్లలో సగటున 170 శాతం వృద్థిని నమోదు చేశామన్నారు. బెంగళూర్‌లో తమకు తయారీ కేంద్రం ఉందన్నారు.