Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ జీబ్రానిక్స్ కొత్త కీబోర్డును ఆవిష్కరించింది. జెబ్ మ్యాక్స్ నింజా 200 పేరుతో దీనిని తీసుకొచ్చింది. భారత్‌లో ఈ విధమైన మెకానికల్ కీబోర్డును తీసుకు రావడం ఇదే మొదటిసారి. ఇందులో అధునా తన ఫీచర్లు ఉన్నాయి. దీనిని సంస్థ డైరెక్టర్ యశ్ దోషి ఆవిష్కరించారు. ఈ ఆర్జీబీ మెకానికల్ కీబోర్డు అవసరం కేవలం గేమర్లకు మాత్రమే కాదనీ.. పీసీ లేదా ల్యాప్‌టాప్‌లపై అధిక సమయం వెచ్చించి పని చేసే ప్రొఫెషనల్స్ కోసం కూడా తీసుకొచ్చినట్టు ఉత్పత్తి ఆవిష్కరణ సందర్భంగా యశ్ దోషి అన్నారు. రూ. 4499కి ఈ కీబోర్డు అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నది.