Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఈ వారం, మహీంద్రా యూనివర్శిటీ తమ వార్షిక టెక్నో–కల్చరల్, మేనేజ్మెంట్ ఫెస్ట్, ఈథర్‌ను నిర్వహిస్తుంది. అత్యద్భుతమైన సాంకేతిక సవాళ్లు, ఆకట్టుకునే ప్రదర్శనల సమ్మేళనంగా ఇది నిలుస్తుంది. విద్యార్ధులు తమ సృజన్మాకత, ఆవిష్కరణ, ప్రతిభను విభిన్న రంగాలలో ప్రదర్శించే వేదికగా ఈథర్ నిలిచింది. ఈ ఫెస్ట్‌లో సాహిత్య, ఉపన్యాస పోటీలతో పాటుగా స్టార్టప్ ఐడియా మారథాన్స్, క్విజ్లు , మూవీ మారథాన్స్, ఎడ్వెంచర్ మిస్టరీలు, మరెన్నో జరుగుతున్నాయి. ఇది ఏప్రిల్ 6 నుంచి 9 , 2023 వరకూ జరుగనున్నాయి.
ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చేందుకు ప్రత్యేక అతిథులను సైతం ఈథర్ ఆహ్వానించింది. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్‌ను మ్యూజిక్ క్లబ్ సైనోలో నిర్వహించింది. అదే రీతిలో , బ్యాటిల్ ఆఫ్ బీట్స్ – డ్యాన్స్ కాంపిటీషన్ ను డ్యాన్స్ క్లబ్ 8 కౌంట్స్ నిర్వహించింది. దీనికి దినేష్ చార్లెస్టన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో అత్యుత్తమ హిప్–హాప్ డ్యాన్సర్లలో ఒకరు. మహీంద్రా యూనివర్శిటీ వద్ద ఫిల్మ్ మేకింగ్ క్లబ్ మాస్టర్‌షాట్ , ఓ ఫిలిం ఫెస్టివల్‌ను వేడుకలో భాగంగా నిర్వహించింది.
ఈథర్ యొక్క ప్రో షోస్‌లో భాగంగా, మైకమ్ బ్యాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం ఏప్రిల్ 6న తమ ప్రదర్శన చేసింది. ఏప్రిల్ 9న వర్ణం బ్యాండ్ ముగింపు వేడుకలో తమ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ వారం విద్యార్థులు ఇంటరాక్ట్ కావడానికి, తమలో దానిగ ప్రతిభను ప్రదర్శించడానికి, రాబోయే సెమిస్టర్లో తమను తాము ఉత్తేజపరుచుకునేందుకు ఏరో, ఈథర్లు అత్యంత ఆకర్షణీయమైన వేదికలుగా యాజమాన్యం, విద్యార్థులు నిర్ధారించారు.