Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఫిన్‌టెక్ సంస్థ జస్ట్‌మనీ తమ 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. జెస్ట్‌మనీ కొనుగోలు కోసం ఫోన్‌పే జరిపిన చర్చలు విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 20 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు గురువారం సాయంత్రం ఆ సంస్థ సిబ్బందికి తెలిపింది. ఉద్వాసనకు గురైన వారికి ఒక నెల వేతన పరిహారం, జీవిత బీమా, మానసిక ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను కల్పిస్తోన్నట్లు సమాచారం. కాగా.. తొలగించిన ఉద్యోగులను ఫోన్‌పే నియమించుకునే అవకాశం ఉంది.