Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 38 శాతం రాబడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి) తమ ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడిని అందిం చింది. తన డివిడెండ్, షేర్ల పెరుగుదలతో బ్యాంక్ ఎఫ్‌డిల కంటే ఆకర్షణీయ రిటర్న్స్ ఇచ్చింది. గడిచిన ఏడాదిలో ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.10 డివిడెండ్‌ను అందించింది. అదే సమయంలో షేర్ ధర 30 శాతం పెరిగింది. ఏడాదికి క్రితం పిఎఫ్‌సి షేర్ విలువ రూ.120గా ఉంది. గురువారం ఈ కంపెనీ షేర్ విలువ రూ.156 వద్ద నమోదయ్యింది. 2022 జూన్‌లో ప్రతీ షేర్‌పై రూ.1.25, సెప్టెంబర్‌లో రూ.2,25, నవంబర్‌లో మరో రూ.3, 2023 ఫిబ్రవరిలో రూ.3.50 శాతం చొప్పున పలు సార్లు డివిడెండ్ చెల్లింపులు చేసింది. షేర్ల ధర పెరుగుదల, డివిడెండ్ కలుపుకుంటే నిరకరంగా 38 శాతం రాబడి నమోదయ్యింది. గతేడాదిలో ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా వడ్డీపై 7 శాతం రాబడి ఉంది. సాంప్రదాయ పెట్టుబడుల కంటే పిఎఫ్‌సి అధిక రిటర్న్‌లను అందించినట్లయ్యింది.