Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలో గృహాల అమ్మకాలు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ప్రస్తుత ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో రూ.3,352 కోట్ల విలువ చేసే నివాసాల అమ్మకాలు జరిగాయని తెలిపింది. మొత్తంగా 6,414 గృహాలు రిజిస్ట్రర్ అయ్యాయనీ, క్రితం నెలతో పోల్చితే 12 శాతం పెరుగుదల అని పేర్కొంది. 2022 మార్చి మాసం అమ్మకాలతో పోల్చితే మాత్రం 5 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. విలువ పరంగా 7 శాతం పెరుగుదల నమోదైంది. అందులో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా ల్లోని నివాసాల అమ్మకాలను పరిగణలోకి తీసుకుని ఈ రిపోర్ట్‌ను రూపొం దించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.25 లక్షల దిగువన ఉన్నవి 19 శాతం కాగా.. రూ.25-50 లక్షల మధ్య నివాసాలు 55 శాతంగా ఉన్నాయి.