Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ఎనిమిదేండ్లలో రూ.23.2 లక్షల కోట్ల ముద్రా రుణాలు జారీ చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చిరు వ్యాపారుల కోసం ముద్రా పథకం ప్రారంభించి ఎనిమిదేండ్లు అవుతున్న దని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దీని వల్ల 40.82 కోట్ల మంది లబ్ది పొందారని తెలిపారు. వారిలో 51 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని పేర్కొన్నారు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి, వ్యాపార విస్తరణకు ఆర్థిక చేయూతను అందించేందుకు రూ.10 లక్షల వరకు తనఖా లేని రుణాలను అందిస్తున్నట్టు తెలిపారు.