Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఈ బ్రాండ్ తమ విభాగంపై దృష్టి సారించిన, లోతైన వినియోగదారుల పరిశోధనను వినియోగదారుల ఇబ్బందులను తెలుసుకునేందుకు నిర్వహించింది. భారతీయ మార్కెట్లో తమ శ్రేణి ఎయిర్‌కూలర్లను ఆవిష్కరించక మునుపే ఎయిర్‌కూలర్ విభాగంలో బహుళ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం లక్ష్యం తరచుగా ఎయిర్‌కూలర్ బ్రేక్‌డౌన్స్ జరగడానికి పంపు విఫలం కావడం ఓ కారణంగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ కారణం చేతనే డ్యూరా మెరైన్ పంప్ రూపకల్పన చేయడం జరిగింది. బ్రాండ్ యొక్క తాజా పోర్ట్‌ఫోలియో హోమ్ అప్లయెన్సస్‌లో ఇది వినూత్న ఆవిష్కరణ
భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్ అప్లయెన్సస్ బ్రాండ్, బజాజ్ తమ తాజా శ్రేణి ఎయిర్ కూలర్స్‌ను డ్యురా మెరైన్ పంప్‌తో విడుదల చేసింది. తద్వారా ఈ వేసవిలో పెరుగుతున్న డిమాండ్ అవసరాలను తీర్చనుంది. సాధారణ పంపుల కంటే మెరుగైన, శాస్త్రీయంగా రూపొందించిన పంప్ ద్వారా ఎయిర్కూలర్లలో సమూలమైన మార్పులను తీసుకురావడంపై బ్రాండ్ దృష్టి సారించింది. ఈ నూతన శ్రేణి, నవీకరించిన హోమ్ అప్లయెన్సస్‌లో భాగం కావడంతో పాటుగా మన్నిక వాగ్ధానం ఆధారంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇవి అత్యంత ధృడమైనవి కావడంతో పాటుగా చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉంటాయి మరియు అతి తక్కువ నిర్వహణనూ కలిగి ఉంటాయి. ఈ బ్రాండ్ యొక్క కన్స్యూమర్ రీసెర్చ్ అధ్యయనం లో పంప్ ఫెయిల్యూర్స్ కారణంగా ఎయిర్‌కూలర్ బ్రేక్‌డౌన్స్ జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ ఎయిర్ కూలర్ యొక్క పంపులు సాధారణంగా ఇన్సులేషన్ సరిగా లేకపోవడం, సుదీర్ఘకాలం పాటుగా మాయిశ్చర్కు ఎక్స్పోజ్ కావడం వల్ల పాడవుతుంటాయి. వినియెగదారుల లక్ష్యిత తమ నిబద్ధతలో భాగంగా, ఈ బ్రాండ్ తమ ఎయిర్‌కూలర్ శ్రేణిని నవీకరించడంతో పాటుగా వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందిస్తుంది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ బిజినెస్,చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ ‘‘ ఈ వేసవిలో, మేము మా మొత్తం శ్రేణి ఎయిర్కూలర్స్ను అత్యాధునిక ఫీచర్లు అయిన డ్యూరా మెరైన్ పంప్ మరియు 2 సంవత్సరాల వారెంటీతో ఆధునీకరించడంతో పాటుగా బిల్ట్ ఫర్ లైఫ్ సిద్ధాంతాన్ని ప్రదర్శించాము. నేటి వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన, మన్నిక కలిగిన ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతికలతో కోరుకుంటున్నారు. హోమ్ అప్లయెన్సస్ విభాగంలో అగ్రగామిగా బజాజ్ ఉంది మరియు వినియోగదారుల అవసరాలు అర్థం చేసుకునేందుకు కట్టుబడి ఉండటంతో పాటుగా వారి సమస్యలనూ తీర్చడానికి కృషి చేస్తున్నాము. అందువల్లనే, మేము పెద్దమొత్తంలో ఆర్ అండ్ డీ కార్యక్రమాలపై పెట్టుబడి పెట్టడంతో పాటుగా అన్ని విభాగాల్లోనూ సాంకేతికతలపై ఆధారపడుతున్నాము’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ ‘‘ఎల్ నినో ప్రభావంతో వేసవి ముందే వచ్చింది మరియు సీజనల్ కూలింగ్ ఉత్పత్తులు అయిన ఎయిర్‌కూలర్లు, ఫ్యాన్లుకు డిమాండ్ కూడా పెరిగింది. ఈ డిమాండ్‌ను ఊహించి, మేము అత్యాధునిక ఫీచర్లతో ఈ పోర్ట్‌ఫోలియో తీర్చిదిద్దాము’’ అని అన్నారు.
తాజా టీవీసీ లింక్ : https://youtu.be/cDhNdmoUrZA
మన్నికకు వాగ్ధానాన్ని డ్యూరా మెరైన్ పంపులు చేస్తున్నాయి. ఇది అత్యుత్తమ శ్రేణి ఇన్సులేషన్ కలిగి ఉండటంతో పాటుగా అత్యుత్తమ భద్రతను అందిస్తుంది. తద్వారా పంపు జీవితకాలం మెరుగుపడుతుంది. మార్కెట్లో లభించే ఇతర పంపుల్లా కాకుండా, ఈ పంపు రెండు సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ ఫీచర్‌ను ఎయిర్ కూలర్స్ వ్యాప్తంగా పరిచయం చేశారు. ఈ నూతన మోడల్స్ రిటైల్ ఔట్లెట్లు, ఈ–కామర్స్ సైట్లు మరియు https://shop.bajajelectricals.com/ వద్ద లభిస్తాయి.