Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతికత గురించిన సమస్త సమాచారంతో కూడిన పుస్తకం, ‘జస్ట్ ఎస్పైర్’ . ఇది స్ఫూర్తిదాయక డాక్టర్ అజయ్ చౌదరి కథ యొక్క జ్ఞాపిక. ఒక చిన్న పట్టణానికి చెందిన బాలుడు, పెద్ద కలలు , కోరికలతో భారతదేశాన్ని సమూలంగా మార్చిన మూడు విప్లవాలు : పీసీ విప్లవం, మొబైల్ టెలిఫోనీ మరియు సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌కు ఏ విధంగా నేతృత్వం వహించినదీ తెలుపుతుంది.
నవతెలంగాణ - హైదరాబాద్
హైటెక్ సిటీ వద్ద నున్న టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్ లో అజయ్ చౌదరి రచించిన ‘జస్ట్ ఎస్పైర్ – నోట్స్ ఆన్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అండ్ ద ఫ్యూచర్’ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ విడుదల చేసింది.
టెక్ మహీంద్రా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ అజయ్ చౌదరి ; టెక్ మహీంద్రా ఎండీ–సీఈఓ సీపీ గుర్నానీ పాల్గొనడంతో పాటుగా ఫైర్ సైడ్ ఛాట్ చేశారు. దీనికి అనుసంధానకర్తగా టెక్ మహీంద్రా గ్లోబల్ సీపీఓ ; హెడ్ ఆఫ్ మార్కెటింగ్ హర్షవేంద్ర సోయిన్ వ్యవహరించారు. హైదరాబాద్ కేంద్రంగా కలిగిన టెక్నాలజీ మేజర్ నుంచి 500 మంది యువ ప్రతిభావంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హెచ్‌సీఎల్ (1975లో భారతదేశపు తొలి స్టార్టప్‌లలో ఒకటి) ఫౌండర్లలో ఒకరైన డాక్టర్ చౌదరి యొక్క అసాధారణ ప్రయాణాన్ని ఈ పుస్తకం ప్రదర్శిస్తుంది. నేడు ఆయనను భారతీయ హార్డ్‌వేర్ పితామహునిగా కీర్తిస్తున్నారు.ఈ అద్భుతమైన సంగ్రహ పుస్తకంలో సాంకేతికతకు సంబంధించిన ప్రతి అంశమూ కవర్ చేశారు మరియు డాక్టర్ అజయ్ చౌదరి యొక్క అద్భుత ప్రయాణాన్ని వివరిస్తుంది. ఈ రంగంలో ఔత్సాహిక ప్రొఫెషనల్స్ అందరికీ ఇది బూస్టర్ డోస్‌లా పనిచేయనుంది.
ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్– చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నానీ మాట్లాడుతూ ‘‘భారతీయ సాంకేతిక పర్యావరణ వ్యవస్ధలో ఆవిష్కరణ, విప్లవం, పరివర్తన పరంగా అజయ్ ఎంతో ముందున్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, మేనేజర్లు మరియు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆరాటపడే ప్రొఫెషనల్స్ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకమిది’’ అని అన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం, డాక్టర్ అజయ్ చౌదరి, అత్యంత ఉత్సాహపూరితమైన ప్రయాణాన్ని ఇండియాకు సొంత మైక్రో కంప్యూటర్ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. ఆయనతో పాటుగా డిజిటల్ ఎలకా్ట్రనిక్స్లోని అతని బృందం ఐటీ పరిశ్రమలో మూడు మైలురాళ్లు : పీసీ విప్లవం, మొబైల్ టెలిఫోనీ మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో తీసుకువచ్చారు. నేడు, చౌదరిని భారతదేశపు హార్డ్‌వేర్ పితామహునిగా కీర్తిస్తున్నారు. ఎలకా్ట్రనిక్స్‌లో స్వీయసమృద్ధి సాధించడంలో ఆయన కృషి అనన్య సామాన్యం. ఆయన గతంలో ఎన్నో ప్రభుత్వ కమిటీలలో పనిచేయడంతో పాటుగా ఇప్పటికీ భారతదేశాన్ని అంతర్జాతీయ ఎలకా్ట్రనిక్స్ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన తోడ్పాటుకు గుర్తింపుగా, ఆయనకు భారతదేశంలో మూడు అతిపెద్ద పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను 2011లో భారత రాష్ట్రపతి అందజేశారు.
డాక్టర్ అజయ్ చౌదరి మాట్లాడుతూ ‘‘అద్భుతమైన ప్రతిభాపాటవాలు కలిగిన యువత నడుమ ఉండటం ఎప్పుడూ స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటుంది. టీమ్‌ను కలుసుకునే అవకాశం అందించిన శ్రీ గుర్నానీ మరియు టెక్ మహీంద్రాకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతున్నాను. నా జీవితకాలంలో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాను. నాకు ఎంతో అందించిన సమాజానికి ,నేటి యువతరానికి తిరిగి ఇవ్వడానికి ఇది అత్యుత్తమ సమయం. ఈ పుస్తకమంతా కూడా నా జీవిత అభ్యాసాలు ఉంటాయి. అలాగే వీటిలో కొన్ని సుదీర్ఘ సవాళ్లను ఏ విధంగా అధిగమించానో కూడా తెలిపాను. నా అనుభవాలతో కూడిన పాఠాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రొఫెషనల్ ప్రయాణానికి విజయవంతమైన మార్గం వేయగలరని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
ఇటీవలి కాలంలో , స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా వాటికి తగిన మార్గనిర్ధేశనమూ ఆయన చేస్తున్నారు. వ్యక్తిగతంగా 50కు పైగా స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టిన ఆయన, భారతదేశంలో అతిపెద్ద ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ బోర్డ్‌పై కూడా సేవలనందించారు. ఐఏఎన్ ఫండ్, ఎలకా్ట్రనిక్ డెవలప్మెంట్ ఫండ్ మరియు క్యాన్బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీలలో సైతం ఆయన ఉన్నారు.
తన జీవితపు తొలి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్న చౌదరి తన పుస్తకంలో వాటిని వివరిస్తూ ‘‘బజల్‌పూర్ లాంటి చిన్న పట్టణంలో పుట్టి, పెరిగిన తాను ఓ కెరీర్‌ను కొనసాగించాలని మరియు భారతదేశాన్ని సమూలంగా మార్చే విప్లవాత్మక ఆవిష్కరణలను చేయాలని కోరుకునేవాడిని కాదు’’ అని అన్నారు.
డాక్టర్ చౌదరి తన అభ్యాసాలు మరియు అనుభవాలను సైతం వెల్లడించడంతో పాటుగా వాటిని తాను ఏ విధంగా విజయాలుగా మలుచుకున్నదీ ఈ రంగాలలో యువ పరిశ్రమ నిపుణులకు స్ఫూర్తి కలిగించేలా వెల్లడించారు. వాటిలో :
• బ్రహ్మాండమైనది సృష్టించడం
• భారతదేశాన్ని సమూలంగా మార్చిన మూడు విప్లవాలు : పీసీ విప్లవం, మొబైల్ టెలిఫోనీ మరియు సిస్టమ్స్ ఇంటిగ్రేషన్
• భారతదేశంలో ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం మరియు ఎలకా్ట్రనిక్స్‌లో భారతదేశాన్ని ఉత్పత్తి దేశంగా మార్చాలని నిర్ణయించుకోవడం
• విస్తృత జ్ఞానంతో ఒకరు ఎంచుకున్న వృత్తిని కాంప్లిమెంటింగ్ చేయడం ద్వారా విస్తృత శ్రేణి పరిజ్ఞానంతో ప్రపంచ థృక్పథం అభివృద్ధి చేయడం.
ఈ పుస్తకంలో హార్డ్‌వేర్ నుంచి భారతదేశపు సాఫ్ట్వేర్ పరిశ్రమ ఎలా ఉద్భవించిందో అత్యంత ఆకట్టుకునే రీతిలో వివరించారు. వ్యవస్ధాపకత, నాయకత్వం, సేల్స్‌మెన్‌షిప్, ఇనిస్టిట్యూషన్ల నిర్మాణం, జాతి నిర్మాణం పై అత్యంతకీలకమైన పరిజ్ఞానం అందించే ఈ పుస్తకం, పెద్దకలలు కనాలి, మార్పును తీసుకురావాలనేందుకూ స్ఫూర్తిని అందిస్తుంది. వ్యవస్ధాపకులు, క్రీడాకారులు, సేల్స్‌పర్సన్, ఇంజినీర్, విద్యావేత్త, జాజ్ కళాకారుడు, గాయకుడు, మదుపరులు, వంటి వారికి అవసరమైన పాఠాలు వెల్లడిస్తుంది.
భారతదేశపు వృద్ధి కథకు తగిన తోడ్పాటునందించడాన్ని చౌదరి కొనసాగిస్తున్నారు. ఎడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (మీటీ) సభ్యునిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్రంగం (నీతి ఆయోగ్) లో కన్సల్టేషన్ గ్రూప్ సభ్యునిగా, సెమీ కండక్టర్ సెక్టార్ (నీతి ఆయోగ్) కమిటీ సభ్యునిగా సేవలనందిస్తున్నారు.
పుస్తకం గురించి...
‘‘బజల్‌పూర్ లాంటి చిన్న పట్టణంలో పుట్టి, పెరిగిన తాను ఆ ఊరిని వదిలి కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు భారతదేశాన్ని సమూలంగా మార్చే విప్లవాత్మక ఆవిష్కరణలను చేయాలని, అవి భారతదేశాన్ని సమూలంగా మార్చాలని అయితే మాత్రం కలగనలేదు’’. వ్యవస్ధాపకుడు, క్రీడాకారుడు, సేల్స్‌మెన్, ఇంజినీర్, విద్యావేత్త, జాజ్ కళాకారుడు మరియు మదుపరుడు అజయ్ చౌదరి. ఎన్నో రంగాలలో తనదైన ముద్ర వేసిన అజయ్, హెచ్‌సీఎల్ సహ వ్యవస్ధాపకులలో ఒకరు. ఆయన ఏది చేసినా అత్యంత సులభంగా ఆ విధులను నిర్వహించారు. భారత స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత అబోత్తాబాద్ నుంచి జబల్పూర్కు వలస వచ్చిన ఓ కుటుంబంలో పుట్టిన అజయ్, జీవితం, ఓ విధమైన జీవితం అంటే – ఇంజినీరింగ్, చక్కటి ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం అనేలా గడిచిపోయేది. కానీ 1975 అతని జీవితంలో మార్పుకు నాంది పలికింది.
ఆ సంవత్సరమే అజయ్ తన ఉద్యోగంను డీసీఎం డాటా ప్రోడక్ట్స్ వద్ద వదిలి, ఎటు తీసుకువెళ్తుందో తెలియని వ్యవస్ధాపక ప్రయాణం ప్రారంభించాడు. హెచ్‌సీఎల్ సహవ్యవస్ధాపకునిగా శివ్ నాదార్, అర్జున్ మల్హొత్రా, యోగేష్ వైద్య, సుభాష్ అరోరా, డీఎస్ పురితో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1970లలో స్ధిరమైన ఆదాయం ఉన్న ఉద్యోగం వదిలి , అదీ భారతదేశంలో సుప్రసిద్ధ బ్రాండ్ వదలి వ్యవస్ధాపకునిగామారడమంటే పిచ్చితనంతో సమానం. దీనికి తోడు భారతీయులలో చాలామందికి కంప్యూటర్ అంటే తెలియదు. స్టార్టప్ అనే పద ప్రయోగానికి దశాబ్దాల ఆమడ దూరంలో ఉన్న కాలమది.
నాలుగు దశాబ్దాలలో హెచ్‌సీఎల్, భారతదేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీలలో ఒకటిగా నిలువడం మాత్రమే కాదు, ప్రతి ఇంటి లోనూ కనిపించింది. ఈ జస్ట్ ఎస్పైర్లో, అజయ్, అత్యంత విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించడం మాత్రమే కాదు, కలలు,కోరికలు, ఆశ, విజయాలను ఓ చిన్న పట్టణపు కుర్రాడి కళ్ల నుంచి వివరించారు. ఈ ప్రయాణంతో పాటుగా ఆయన వ్యవస్ధాపక పాఠాలు, టెక్నాలజీ, భవిష్యత్ గురించి కూడా వెల్లడించారు. కలలు కనేవారికి మరియు సాధకులకు ఈ పుస్తకం ఓ ప్రేరణ.
హార్పర్ బిజినెస్, నాలుగు కలర్ ఇన్సర్ట్స్తో 240 పీపీ హార్డ్బుక్ 599 రూపాయలు.