Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ బిల్ పే సదుపాయం కలిగిన చెల్లింపు విధానాలను వినియోగించి అమేజాన్ పే పై తమ లోన్స్ ను సౌకర్యవంతంగా చెల్లించడానికి ఈ ఫీచర్ కస్టమర్స్ కు వీలు కల్పిస్తుంది
నవతెలంగాణ - హైదరాబాద్
కస్టమర్ అనుభవం మరియు భద్రతను పెంచడానికి తమ నిరంతర ప్రయత్నాలలో భాగంగా, అమేజాన్ పే భారత్ బిల్ పే సహకారంతో తమ లోన్ చెల్లింపు శ్రేణిని మరింత శక్తివతం చేసింది. లోన్ చెల్లింపు శ్రేణి అనేది విద్యుచ్ఛక్తి మరియు మున్సిపల్ పన్ను వంటి ఇతర ఆప్షన్స్ లో బిల్లు చెల్లింపులో ప్రముఖ శ్రేణిలలో ఒకటిగా ఉంది. ఈ శ్రేణి బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఎన్ బీఎఫ్ సీలు ద్వారా తమ లోన్స్ ను పొంది మరియు తమ ఈఎంఐలను సకాలంలో చెల్లించడానికి సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపిక అవసరమైన కస్టమర్స్ కోసం లోన్ చెల్లింపు ఆప్షన్ ను సమన్వయం చేస్తుంది. ఇంకా, ఈఎంఐ తీసివేతలకు అదనంగా తమ లోన్స్ ను ముందస్తుగా చెల్లించడానికి కస్టమర్స్ తోడ్పాటు అందించగలరు. ఈ శ్రేణి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, చోళ మండలం ఇన్వెస్ట్ మెంట్ & ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, హెచ్ డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హోమ్ క్రెడిట్, మరియు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సహా, 200+కి పైగా రుణదాతలతో అనుసంధానం చెందింది. దీనిని పొందడానికి, కస్టమర్స్ అమేజైన్ పే విభాగాన్ని సందర్శించవచ్చు మరియు లోన్ రీపేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, వారు 'Amazon.in' హోమ్ స్క్రీన్ పై లభించే 'పే బిల్స్' ఆప్షన్ పై సులభంగా క్లిక్ చేయవచ్చు మరియు తదుపరి నిరంతరంగా తమ ఈఎంఐలను చెల్లించడానికి లోన్ రీపేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
ఈ అభివృద్ధి పై వ్యాఖ్యానిస్తూ, అనూరాధ అగర్వాల్, యూజర్ గ్రోత్ అండ్ సీఎంఓ డైరక్టర్, అమేజాన్ పే ఇండియా, ఇలా అన్నారు, "సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు బహుమానపూర్వకమైన చెల్లింపు అనుభవాలను సృష్టించడం ద్వారా కస్టమర్స్ కోసం డిజిటల్ చెల్లింపులను సరళం చేయడమే మా మిషన్. సురక్షితమైన డిజిటల్ చెల్లింపు వేదిక మరియు చెల్లింపు ఆప్షన్స్ యొక్క సరళలు లభించకపోవడం తమ లోన్స్ ను చెల్లించడంలో కస్టమర్స్ ఎదుర్కొనే సమస్యలలో భాగంగా ఉన్నాయి. లోన్ చెల్లింపు శ్రేణికి వీలు కల్పించి, పెంచడానికి భారత్ బిల్ పేతో మా సహకారం ఈ సవాలును సమర్థవంతంగా పరిష్కరించడమే కాకుండా అనుభవాన్ని కూడా సరళతరం చేస్తుంది, తద్వారా అమేజాన్ లో అత్యంత వేగంగా పెరుగుతున్న శ్రేణిలలో ఒకటిగా చేస్తుంది. మేము అలాంటి కస్టమర్ హితమైన పరిష్కారాలను కేటాయించడాన్ని కొనసాగిస్తాము మరియు భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని మరింత విస్తరింప చేస్తాము."
ఈ భాగస్వామం పై, నూపుర్ చతుర్వేది, సీఈఓ, ఎన్ పీసీఐ భారత్ బిల్ పే లిమిటెడ్ (ఎన్ బీబీఎల్), ఇలా వ్యాఖ్యానించారు, "సంప్రదాయబద్ధమైన రుణదాతలు మరియు ఆధునిక ఆర్థిక సంస్థలు నుండి లోన్స్ పొందే కస్టమర్స్ కోసం సులభంగా లోన్ ఈఎంఐ చెల్లింపు పరిష్కారం పరిచయం చేయడానికి మేము అమేజాన్ పేతో అనుబంధాన్ని కలిగి ఉన్నందుకు ఆనందిస్తున్నాము. ఈ సహకారంతో, కస్టమర్ తమ ఈఎంఐలను సురక్షితంగా చెల్లించడానికి ఇబ్బందిరహితమైన మరియు తక్షణ చెల్లింపు వ్యవస్థను అనుభవించవచ్చు."
అమేజాన్ పే పై ఈ శ్రేణిని పొందడానికి, కస్టమర్స్ తమ బ్యాంక్ ను లేదా ఎన్ బీఎఫ్ సీని జాబితా నుండి ఎంచుకోవచ్చు మరియు తమ లోన్ అకౌంట్ నంబర్ లేదా బ్యాంక్ కోరిన ఏదైనా ఇతర వివరాలను నమోదు చేయవచ్చు మరియు 'ఫెచ్ ఈఎంఐ' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అపరిష్క్రతంగా ఉన్న లోన్ /ఈఎంఐ పై సమాచారం ప్రదర్శించబడుతుంది మరియు చెల్లింపు పద్ధతిని ఎంచుకోవడం ద్వారా కస్టమర్స్ చెల్లించవచ్చు. బిల్లు చెల్లింపుల లావాదేవీల నిర్థారణలు amazon.in పై తక్షణమే లభిస్తాయి; అయితే, లావాదేవీని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత చెల్లింపును ప్రాసెస్ చేసి, ఆమోదించడానికి కొన్ని బ్యాంక్స్ కు ముందుగా నిర్ణయించబడిన టర్న్ అరౌండ్ టైమ్ (టీఏటీ) కావాలి.