Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 2023లో ఐదు ప్రధాన నగరాలలో
- ఈబీ–5 సెమినార్లు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో జరుగనున్నాయి
నవతెలంగాణ - హైదరాబాద్
అంతర్జాతీయ భవిష్యత్‌ను నిర్ధేశించే వ్యాపారాలు, విద్య, కెరీర్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను కల్పించడంతో పాటుగా యునైటెడ్ స్టేట్స్లో నివాసముండే అవకాశాలను కల్పించేందుకు యుఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (యుఎస్ఐఎఫ్) భారతదేశంలో ఏప్రిల్ 13 నుంచి ఈబీ–5 కన్సల్టేషన్స్‌ను నిర్వహించబోతుంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఈ కన్సల్టేషన్స్‌ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ఎక్స్‌క్లూజివ్ సెమినార్ల ద్వారా మదుపరులతో పాటుగా వారి కుటుంబాలకు ఈబీ–5 ప్రోగ్రామ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా యుఎస్ గ్రీన్ కార్డ్ పొందే విధానం గురించి కూడా తెలుపనున్నారు. ఈ సమావేశాల ద్వారా యుఎస్ఐఎఫ్ బృందంతో ముఖాముఖి చర్చలు జరపడం కూడా చేయవచ్చు.
ఈ కార్యక్రమం గురించి యుఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (యుఎస్ఐఎఫ్) అధ్యక్షుడు నికోలాస్ ఏ మాస్ట్రోయిన్నీ 3 మాట్లాడుతూ ‘‘ ఈ సమావేశాలు భావి మదుపరులకు తగిన అవకాశాలను గురించి వెల్లడించడంతో పాటుగా ఈబీ–5 వీసా ప్రోగ్రామ్ గురించి కూడా తెలుపుతుంది. మా బృందం, ఇమ్మిగ్రేషన్ అధికారుల సహాయంతో, భారతీయ మదుపరులు, వారి కుటుంబసభ్యులకు ప్రత్యామ్నాయ వీసా అవకాశంగా ఈబీ–5 వీసాలు ఎందుకు నిలుస్తాయో వెల్లడించనున్నాము’’ అని అన్నారు.
1990లో యుఎస్ కాంగ్రెస్ ఈబీ–5 ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా రెండవ అతి పెద్ద ఈబీ–5 ఇన్వెస్టర్ మార్కెట్‌గా ఇండియా నిలిచింది. కనీసం 8 లక్షల డాలర్లను అర్హత కలిగిన ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడంతో పాటుగా యుఎస్‌లో కనీసం 10 ఉద్యోగాలను సృష్టించగలిగిన వారికి ఈ వీసాలను అందిస్తారు.
భారతీయ మదుపరులు ఈ పథక ప్రయోజనాలను పొందడంతో పాటుగా గత 12 నెలల కాలంలో ఈబీ–5 వీసాల దరఖాస్తు పరంగా స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తున్నారు.
ఏప్రిల్ 2023లో భారతీయ మదుపరులను యుఎస్ఐఎఫ్ కోసం ఇమ్మిగ్రేషన్ అటార్నీ భాగస్వాములు, ఎగ్జిక్యూటివ్ బృందం ముంబైలో ఏప్రిల్ 13–16 ; ఢిల్లీలో ఏప్రిల్ 17–18 ; హైదరాబాద్ లో ఏప్రిల్ 19–20; చెన్నైలో ఏప్రిల్ 23 ; బెంగళూరులో ఏప్రిల్ 24–25 తేదీలలో కలుస్తారు. ఈ మీటింగ్‌ను షెడ్యూల్ చేసుకోవడం కోసం https://visaeb-5.com/about-eb-5/eb-5-consultation/ చూడవచ్చు.