Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్రాడేలో 900 పాయింట్లు ఫట్
ముంబయి : బ్యాంకింగ్ సంక్షోభ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. సోమవారం ఉదయం నుంచి తుది వరకు నష్టాల్లోనే సాగాయి. సెన్సెక్స్ ఓ దశలో ఏకంగా 900 పాయింట్లు కోల్పోయింది. అదాని షేర్ల అమ్మకాలు కొనసాగడంతో నష్టాలు చవి చూశాయి. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 361 పాయింట్లు లేదా 0.62 శాతం పతనమై 57,629కి పడిపోయింది.