Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిల్‌షుక్‌నగర్‌లో కొత్త శాఖ ఏర్పాటు
హైదరాబాద్ : ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దిల్షుక్ నగర్లో కొత్త శాఖను ఏర్పాటు చేయడంతో దేశ వ్యాప్తంగా 610 శాఖలకు విస్తరిం చినట్లయ్యిందని తెలిపింది. ఇది హైద రాబాద్‌లో తమ బ్యాంక్‌కు 5వ శాఖ అని ఆ బ్యాంక్ ఎండి, సిఇఒ ఇట్టిరా డేవిస్ తెలిపారు. ''బ్యాంకింగ్ సేవలను సులభంగా, అందుబాటులోకి తీసు కువచ్చేందుకు కట్టుబడి ఉన్నాము. స్థానిక ప్రజలు నుంచి ఇటీ వల హైదరా బాద్‌లో ప్రారంభించిన నాలుగు బ్రాంచ్‌లలో మాకు లభించిన అద్భుతమైన స్పందనతో మేము సంతోషిస్తున్నాము. మరింత మెరుగైన సేవలు అంది స్తాం. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో టర్మ్ డిపాజిట్లను అంది స్తోన్నాం. 560 రోజులు ఉంచే ఎఫ్‌డిలపై వినియోగదారులకు 8.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.75% వడ్డీని అందిస్తోన్నాం.'' అని డేవిస్ పేర్కొన్నారు.