Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తం కాకుంటే అనర్థమే
హైదరాబాద్ : దేశంలో 7.7 కోట్ల మంది పైగా మధుమేహంతో బాధపడుతున్నారని అబాట్ న్యూట్రిషన్ బిజినెస్ మెడికల్ అఫైర్స్ రహెడ్ డాక్టర్ ఇర్పాన్ షేక్ అన్నారు. 2045 నాటికి 13.5 కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాల్లో దేశంలో మధుమోహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150 శాతం పెరిగిందన్నారు. పట్టణీకరణకు తోడు ప్రజల అహార అలవాట్లు ఈ రోగానికి ప్రధాన కారణాలన్నారు. జోస్లిన్ డయాబెటిస్ సెంటర్లోని ఇన్ పేషేంట్ డయాబెటిస్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఒబేసిటీ క్లినికల్ ప్రోగ్రామ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఓసామా హమ్డీ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చిన అహారపు అలవాట్లను వదిలివేయడాన్ని మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో గమనించవచ్చన్నారు.