Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హలియాన్ (మునుపటి గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కేర్) వారి నుండి ఒక అగ్రగామి నోటి సంరక్షణ బ్రాండు అయిన సెన్సొడైన్, 'ప్రపంచ నోటి ఆరోగ్య దినాచరణ' ను జరుపుకోవడానికి 2023 మార్చి 13 నుండి 31 వరకు ఒక ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. వినియోగదారులు తమంత తాముగా నోటి సంరక్షణ గురించి తెలుసుకునేలా వారికి అవగాహన కల్పించడానికి మరియు ఒక ప్రాథమిక దంతనిపుణుడి సంప్రదింపుకు వారికి వీలు కలిగించడానికి ఈ ప్రచారోద్యమం ‘BeSensitiveToOralHealth’ ప్రారంభించబడింది.
ఇండియాలోని నాలుగు ప్రాంతాల వ్యాప్తంగా 70 నగరాలలో సుమారు 5,000 మంది రోగులను లక్ష్యంగా చేసుకొని దంత పరిశుభ్రత మరియు నోటి సంరక్షణ గురించిన ప్రాథమికాంశాలపై అవగాహన కల్పించడానికి గాను సెన్సొడైన్ బృందము దాదాపుగా 500 దంత శిబిరాలను ఏర్పాటు చేయాలని యోచించింది. అంతే కాకుండా, 85 నగరాలలో 100 దంతవైద్య కళాశాలలు మరియు సుమారుగా 3000 దంత వైద్యశాలల భాగస్వామ్యంతో ఇండియా వ్యాప్తంగా సుమారు 1లక్ష + వినియోగదారులకు ఉచిత దంతవైద్యుల సంప్రదింపులను ఏర్పాటు చేయాలని సెన్సొడైన్ సంకల్పించింది. ప్రాక్టో వారి భాగస్వామ్యముతో, సెన్సొడైన్ బృందము దాదాపుగా 30,000 మందికి ఉచిత దంత సంప్రదింపులను ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకొంది.
ఈ ప్రచారోద్యమం యొక్క సఫలతపై వ్యాఖ్యానిస్తూ, ఇండియా ఉపఖండపు హలియాన్ (మునుపటి గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కేర్), ఓరల్ కేర్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ కుమారి అనురితా చోప్రా గారు ఇలా అన్నారు, "ఇప్పటికి ఒక దశాబ్ద కాలానికి మించి సెన్సొడైన్, వినియోగదారుల వ్యాప్తంగా స్థితి అవగాహనను ముందుకు నడిపే తన విధానముతో సుపరిచితమై ఇండియాలో ఒక విశ్వసనీయమైన బ్రాండుగా ఉంటోంది. ఈ ప్రపంచ నోటి ఆరోగ్య దినాచరణ రోజున, మెరుగైన నోటి ఆరోగ్యం యొక్క అవసరం పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం, తద్వారా వారి జీవన నాణ్యతను మెరుగుపరచడమనేది మా ధ్యేయము. మన సమగ్ర ఆరోగ్యానికి మనం సున్నితంగా మారినప్పటికీ, మన సమగ్ర ఆరోగ్యములో కీలకమైన భాగమైన నోటి ఆరోగ్యం మరియు పరిశుభ్రతను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము. ఈ ప్రచారోద్యమం ద్వారా, ప్రజలు తమ నోటి ఆరోగ్యం మరియు పరిశుభ్రత పట్ల బాధ్యతాయుతమైన శ్రద్ధ తీసుకునేలా మేము వారిని ప్రోత్సహించగలిగాము.
హలియాన్ (మునుపటి గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కేర్), ఓరల్ హెల్త్ కేర్ - కేటగరీ హెడ్ భావనా సిక్కా గారు కూడా ఈ ప్రచారోద్యమం యొక్క విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఇలా అన్నారు, "ప్రతి ఒక్కరూ మంచి నోటి ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాప్యతా హక్కును కలిగి ఉంటారు మరి అందువల్ల 'BeSensitiveToOralHealth' ప్రచారోద్యమంతో, భారతీయులు తమ నోటి ఆరోగ్యం పట్ల మెరుగైన శ్రద్ధ తీసుకొనేలా మరియు దంతవైద్యుల సంప్రదింపులకు వారికి ప్రాప్యత కలిగించేలా సరియైన పరిజ్ఞానము మరియు పరిష్కారాలతో వారిని సాధికారపరచడంలో మేము విజయవంతమయ్యాము. నోటి సంరక్షణ ఫలితాంశాలను మెరుగుపరచుకోవడానికి మరియు మంచి నోటి పరిశుభ్రత నిర్వహణ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలనే మా నిబద్ధతకు ఈ చొరవలు ప్రతిబింబముగా ఉంటాయి" అన్నారు.