Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌పై ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు కోర్టుకు ఎక్కారు. ట్విట్టర్ మాజీ సిఇఒ పరాగ్ అగర్వాల్ సహా మాజీ లీగల్ హెడ్ విజయ గద్దె, మాజీ సిఎఫ్ఒ సెగల్ ముగ్గురు కలిసి చట్టపరంగా తమకు రావాల్సిన చెల్లింపులు చేయాలంటూ అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టును ఆశ్రయించారు. 10 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ కమిషన్ వ్యాజ్యాలు, ప్రభుత్వ విచారణలకు సంబంధించి పలు దఫాలుగా విచారణలో భాగంగా తాము ఖర్చు చేసిన లీగల్ ఫీజులకు గాను ట్విట్టర్ తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉందని వారు కోర్టులో దావా వేశారు.