Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వావ్ ! మోమో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ తాజా వెంచర్ వావ్ ! ఈట్స్‌ను బేగంపేటలో ప్రారంభించింది. ఈ నూతన ఔట్లెట్ , అత్యుత్తమమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన మూడు బ్రాండ్లు : వావ్! చికెన్ ; వావ్! మోమో మరియు వావ్! చైనా లను ఒకే గూటి కిందకు తీసుకువస్తుందనే వాగ్ధానం చేస్తుంది. ఫుడీస్ కలను ఇది సాకారం చేయడం మాత్రమే కాదు, మూడు అత్యంత రుచికరమైన కలినరీ సమ్మేళనంగా ఇది ఉంటుంది.
వావ్ ! ఈట్స్ వద్ద పాకశాస్త్ర ఆవిష్కరణలు ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. తాజా పదార్థాలతో తయారు చేసే వంటకాలు, చవులూరించే అద్భుతాలుగా మారిపోవడమే కాదు నోరూరిస్తాయి. క్రిస్పీ చికెన్ మొదలు, నోటిలోనే కరిగిపోయే మోమోల వరకూ వావ్! ఈట్స్‌లో మీ కలినరీ ప్రయాణం మరింత కోరుకునేలా చేస్తుంది. అతిథులకు కలినరీ ప్రయాణం చేయించాలనే ప్రయత్నంలో తాము ఉన్నామని వావ్! మోమో ఫుడ్స్ కో–ఫౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు. తమ మెనూ స్ట్రీట్ స్టైల్ స్నాక్స్, అతి సున్నితమైన రుచుల సంగమంలా ఉంటుందన్నారు.
దేశవ్యాప్తంగా 27 నగరాలలో 500కు పైగా ఔట్ లెట్లు కలిగిన వావ్! ఇప్పటికే కలినరీ సూపర్‌స్టార్‌గా ఖ్యాతి గడించింది. ఇప్పుడు వావ్! ఈట్స్ ప్రారంభంతో ఇప్పుడు మరో దశకు వీరు చేరనుంది. వావ్! ఈట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రసిద్ధ బ్లాగర్స్, ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. ఈ ఉత్సాహాన్ని మరింతగా పెంచేందుకు సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మొహమ్మద్ అలీ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయన ఈ ఔట్లెట్ ప్రారంభించడంతో పాటుగా మరుపురాని రీతిలో ఈ ప్రారంభాన్ని నిలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న వావ్! ఈట్ మీ ఆకలిని తీర్చడమే కాదు, నూతన రుచులను కూడా చవిచూపించి, మరుపురాని జ్ఞాపకాలను సైతం అందిస్తుంది.