Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణ ప్రక్రియ వేగవంతం
న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఐదు ప్రయివేటు రంగ సంస్థలు పోటీలో నిలిచాయి. ఐదు సంస్థల బిడ్డింగ్‌ల ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూల్యాంకనం చేస్తుందని రాయిటర్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఐడిబిఐ చేజిక్కించుకోవడానికి కొటాక్ మహీంద్రా బ్యాంక్, ప్రేమ్ వాట్సానకు చెందిన సిఎస్బి బ్యాంక్, ఎమరైట్స్ ఎన్‌బిడి తదితర సంస్థలు ఆసక్తి కనబర్చుతూ బిడ్డింగ్ వేశాయని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఐడిబిఐ బ్యాంక్‌లో కేంద్రానికి 45.48 శాతం వాటా ఉండగా.. ఇందులో 30.48 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. అదే విధంగా ఎల్ఐసికి 49.24 శాతం వాటా ఉండగా... 30.24 శాతం వాటాను విక్రయించనుంది. దీంతో మెజారిటీ వాటాలు ప్రయివేటు శక్తులకు చెందనున్నాయి.