Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని తెలుస్తోంది. కొత్త ఏడాది జనవరిలో ఓ దఫా 12వేల మంది లేదా మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో రౌండ్లోనూ సిబ్బందిని పీకెయ్యాలని యోచిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. మరో దఫా ఉద్వాసనలు ఉండొచ్చని గూగుల్ సిఇఒ సుందర్ పిచారు స్వయంగా వాల్‌స్ట్రీట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. కాగా.. ఎంత మందిని, ఏ విభాగాల్లో తొలగించేది ఆయన స్పష్టం చేయలేదు. ఎఐ చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్, గూగుల్ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. కంపెనీలో జరుగుతున్న ప్రతీ పనిని పరిశీలిస్తున్నామన్నారు. తద్వారా ఖర్చులను పున్ణసమీక్షించడం ద్వారా కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం పెంచాలని భావిస్తున్నామన్నారు.