Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది మార్చిలో భారత ఉత్పత్తుల ఎగుమతులు 13.9 శాతం పతనమై 38.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక అనిశ్చిత్తికి తోడు భారత సరుకులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, నాణ్యతపరంగా పోటీ పడలేక పోతున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గడిచిన నెలలో దిగుమతులు 7.9 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లుగా చోటు చేసు కున్నాయి. 2022 ఇదే మార్చిలో భారత ఎగుమతులు 44.57 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 63 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. గడిచిన మార్చిలో భారత వాణిజ్య లోటు 19.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022-23లో స్థూల వాణిజ్య లోటు 122 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుందని ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. 2021-22లో ఇది 85.53 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.