Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థను రోజు రోజుకు వాణిజ్య పరంగా మార్చే స్తున్నారు. విని యోగదారులు పోస్టులు చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదిం చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఎక్కువ సమాచారం, అధిక నిడివి ఉన్న వీడియోల వరకు పోస్టు చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్ ఆప్షన్‌తో రాబడి పొందవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపింది. తొలుత దీన్ని అమెరికాలో ప్రారంభిం చింది. తర్వాత అన్ని దేశాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. తాజా మార్పుల ద్వారా మరింత ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ట్విట్టర్ వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఆ సంస్థ యత్నిస్తోంది.