Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేక్ష ఎడ్యుటెక్ శ్రీకారం
హైదరాబాద్ : స్టార్టప్ సంస్థ 'ప్రేక్ష ఎడ్యుటెక్' వినూత్న ఒరవడికి నాంది పలికినట్లు తెలిపింది. విద్యా సంబంధిత ఫీజులను ఇఎంఐ పద్దతిలో చెల్లించడానికి తల్లిదండ్రులకు సహాయపడనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అధిక విద్యా వ్యయంతో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడానికి జీరో-కాస్ట్ ఫీజు ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించనున్నట్లు ప్రేక్ష ఎడ్యుటెక్ వ్యవస్థాపకుడు కోనేరు రవితేజ తెలిపారు. రెండు లక్షల మంది విద్యార్థులకు ఫైనాన్సింగ్ అందించడానికి 50 ప్రతిష్టాత్మక పాఠశాలలు, కళాశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నా మన్నారు. పూర్తి వివరాలకు తమ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు.