Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 19.8 శాతం వృద్థితో రూ.12,047 కోట్ల నికర లాభాలు సాధించింది. రుణాల జారీలో మెరుగైన వృద్థి వల్లే అధిక లాభాలను ఆర్జించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏకంగా 23.7 శాతం పెరిగి రూ.23,351.8 కోట్లకు చేరింది. గతేడాది ఇదే మార్చి త్రైమాసికంలో రూ.7637.1 కోట్లుగా ఉన్న ఇతర ఆదాయం.. క్రితం త్రైమాసికంలో రూ.8731.2 కోట్లకు చేరింది. 2023 ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.23 శాతం నుంచి 1.12 శాతానికి తగ్గాయి. బ్యాంక్ మొత్తం బ్యాలెన్ష్ షీట్ 19.2 శాతం పెరిగి రూ.24.6 లక్షల కోట్లకు చేరింది.