Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్థిక సేవల గ్రూప్ మిరే ఎసెట్ తమ ఆన్లైన్ రిటైల్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాం ఎం.స్టాక్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో 1.8 లక్షల మంది పెయిడ్ యూజర్లను సంపాదించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకేసారి రూ.999 ఫీజుతో లభించే 'జీరో బ్రోకరేజ్ ఇన్ ప్రొడక్ట్స్ ఫర్ లైఫ్' ధర ఎం.స్టాక్ వద్ధికి దోహదం చేసిందని తెలిపింది. యాక్టివ్ క్లయింట్ నిష్పత్తి 71 శాతం, 8.5 కోట్లకు పైగా ట్రేడ్లు, ఒక సంవత్సరంలో 71 లక్షలకు పైగా యాప్ డౌన్లోడ్లతో ఎం.స్టాక్‌కు పెరుగుతున్న ప్రజాదరణ ను గుర్తించవచ్చని పేర్కొంది.