Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : భారత్లో తన అమ్మకాలు, మార్కెటింగ్ కార్యక లాపాలను బజాజ్ ఆటోకు బదిలీ చేస్తూ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ లిమిటెడ్ నిర్ణయం తీసు కుంది. నూతన శ్రేణీ మిడ్-సైజ్ ట్రయంప్ మోటార్ సైకిళ్లను సృష్టించడానికి ఇరు సంస్థలు పరస్పర భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ట్రయంఫ్ మోటార్ సైకిల్ సంస్థకు ఉన్న 15 డీలర్షిప్లను ఇకపై బజాజ్ ఆటో నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే రెండేళ్లలో 120కి పైగా నగరాల్లో ట్రయంఫ్ డీలర్షిప్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ పేర్కొన్నారు.