Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : క్రిములనుండి సంరక్షణను ఇచ్చే, భారతదేశపు అత్యంత విశ్వసనీయ బ్రాండ్ ఇచ్చే డెట్టాల్, 99.99% క్రిముల నుండి సంరక్షణ హామీతో పాటుగా తేమను కాపాడే సుగుణాన్ని కూడా అందించేట్లుగా తన ఒరిజినల్ లిక్విడ్ హ్యాండ్‌వాష్‌ను రీఫార్ములేట్ చేసింది. సద్గుణాలతో కూడిన పదార్ధాలు కలిగిన, చర్మసంబంధంగా పరీక్షించబడిన కొత్త డెట్టాల్ లిక్విడ్ హ్యాండ్‌వాష్‌తో కడుగుకున్న ప్రతిసారి చేతులు మృదువుగా, మెత్తగా ఉంటాయి. క్రిముల సంహారం మరియు సమర్ధవంతమైన శుభ్రతను అందించే ఉత్తమమైన చేతుల పారిశుభ్రతా పరిష్కారాలను వినియోగదారులకు అందించేందకు డెట్టాల్ ఎల్లప్పుడూ కృషి చేస్తూ వచ్చింది. ప్రవేశపెట్టినప్పటినుండి డెట్టాల్, సబ్బును పంచుకోవటం అంటే క్రిములను పంచుకోవటమేనని వినియోగదురులకు తెలియచెప్పటం పై దృష్టి సారిస్తూ వచ్చింది. అందుకని డెట్టాల్, శుద్ధమైన మరియు వేరొకరు తాకని లిక్విడ్ సోప్ వంటి అత్యుత్తమమైన పరిష్కారాలను తన వినియోగదారులకు ఆఫర్ చేసింది. మెరుగుపరిచిన ఈ లిక్విడ్ హ్యాండ్‌వాష్, 5 సంవత్సరాల తర్వాత డెట్టాలో కోసం ఈ విభాగంలో తొలి రీఫార్ములేషన్. 99.99 శాతం క్రిముల నుండి సంరక్షణ అనే లాభానికి అదనంగా, తరచుగా చేతులు కడుగుకోవటం వలన కలిగే అతి పెద్ద సమస్య అయిన చేతులు పొడిబారటం అనే సమస్యను ఈ రీఫార్ములేషన్ పరిష్కరిస్తుంది. ఈ సరికొత్త మరియు మెరుగైన మాయిశ్చర్ సీల్ (తేమను కాపాడే) ఫార్ములా, మీ చేతులను మృదువుగా ఉంచి, తేలికపాటి మనోహరమైన సువాసనను కలిగి కలిగిస్తుంది. ఉత్పత్తిని విడుదల చేసే సందర్భంగా మాట్లాడుతూ, దిలేన్ గాంధి, ప్రాంతీయ మార్కెటింగ్ డైరెక్టర్, దక్షిణ ఆసియా – ఆరోగ్యం & పోషణ, రెకిట్ ఇలా అన్నారు, “డెట్టాల్ లిక్విడ్ హ్యాండ్‌వాష్, భారతదేశంలో లిక్విడ్ హ్యాండ్‌వాష్ విభాగంలో అగ్రగామి. గత 30 సంవత్సరాలకు పైగా మేము, పలు రకాల వ్యాధులను తగ్గించగలిగే చేతుల పారిశుధ్యానికి సంబంధించిన మంచి అలవాట్లను పెంపొందించే ఆశయంతో పని చేస్తూ వచ్చాము. మా కార్యక్రమంలో భాగంగామేము పలు క్యాంపెయిన్లను నిర్వహించాము, ఈ మంచి అలవాట్లను చేసుకోవటంలో అడ్డంకులను తొలగించే వినూత్నమైన ఉత్పత్తులను విడుదల చేశాము. ఈ ఏడాది మేము, మా ఫ్లాగ్షిప్ డెట్టాల్ లిక్విడ్ హ్యాండ్‌వాష్ ఉత్పత్తి పై ఒక అతి పెద్ద రీఫార్ములేషన్ను విడుదల చేస్తున్నాము. దీని ద్వారా మేము డెట్టాల్ యొక్క విశ్వసనీయమైన క్రిముల నుండి సంరక్షణ సద్గుణాన్ని మరియు మాయిశ్చర్ సీల్ ఫార్ములా అందించే హాయైన అనుభవంతో కలిపి అందించగలుగుతాము. ఈ రెండు సుగుణాలు, కడుగుకున్న ప్రతిసారి, మీ చేతులను శుభ్రంగా, ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంచుతాయి.” ఈ కొత్త ఉత్పత్తి ప్యాక్ డిజైన్, అనారోగ్యాలను కలిగించే క్రిముల నుండి డెట్టాల్ యొక్క 99.99 శాతం సంరక్షణను, దానితో పాటు మృదువైన చేతుల కోసం మాయిశ్చర్ సీల్‌ను పునరుద్ఘాటిస్తుంది. ఈ బ్రాండ్ ఒక కొత్త టివిసిని కూడా విడుదల చేసింది. అందులో ‘సబ్బును పంచుకోవటం క్రిములను పంచుకోవటం‘కు దారితీస్తుందని తెలియచెబుతూ, మెరుగుపరిచిన ఉత్పత్తిని ప్రదర్శించటం జరుగుతుంది. 99.99% క్రిముల నుండి సంరక్షణ, మాయిశ్చర్ సీల్ మరియు హ్యాండ్‌వాష్‌లో ప్రతి చుక్క శుభ్రమైనది, తాకనిది – అనే ఉత్పత్తి యొక్క ముఖ్యమైన USPలను ఈ టివిసి ప్రదర్శిస్తుంది. కొత్త డెట్టాల్ లిక్విడ్ హ్యాండ్‌వాష్ యొక్క ఒక 200ml పంప్ ప్యాక్ ధర INR 79 మరియు ఒక 675 ml రీఫిల్ ప్యాక్ ధర INR 99. ఇవి భారతదేశవ్యాప్తంగా ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ రీటెయిల్ దుకాణాలలో లభిస్తున్నాయి.