Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టిఐకి సెబీ సమాధానం
ముంబయి: అదానీ కంపెనీ లకు ప్రభుత్వ రంగ రెగ్యూలేటరీ సంస్థలు వత్తాసు పలుకుతున్నా యని మరోసారి రుజువయ్యింది. దీనికి నిదర్శనం.. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ) చందాదారుల వివరాలు లేవని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చెప్పడమే. అదానీ ఎఫ్‌పిఒలో పాల్గొన్న చందాదారుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద ప్రసంజిత్ బోస్ అనే వ్యక్తి జనవరి 31, ఫిబ్రవరి 8న రెండు సార్లు సెబీకి దరఖాస్తు చేసుకున్నారు.
ఆ సమాచారాన్ని ఇవ్వడానికి చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిపిఐఒ) నిరాకరించారు. సెబీ వద్ద దానికి సంబంధించిన సమాచారం లేదని తెలిపారు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పిఒకు మూడు రోజుల ముందు అమెరికన్ హిండెన్‌బర్గ్ సంస్థ అదాని గ్రూపు తీవ్ర ఆర్థిక అక్రమా లకు పాల్పడుతుందని నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎఫ్‌పిఒను అదానీ గ్రూపు ముందుకు తీసుకెళ్లినప్పటికీ.. తర్వాత రద్దు చేసుకుంది.